ఆదివారం, 5 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 28 ఆగస్టు 2018 (12:08 IST)

వీడు నాకు పుట్టలేదన్న భర్త... చంటిబిడ్డను నేలకేసి కొట్టిన తల్లి...

భార్యాభర్తల మధ్య గొడవ ఓ చంటిబిడ్డ ప్రాణానికి ముప్పు ఏర్పడింది. నడిరోడ్డుపై కీచులాడుకున్న ఆ దంపతులు.. ఆ కోపాన్ని పసికందుపై చూపించారు. ముఖ్యంగా భర్తపై ఉన్న కోపంతో భార్య చంటిబిడ్డను నేలకేసికొట్టింది.

భార్యాభర్తల మధ్య గొడవ ఓ చంటిబిడ్డ ప్రాణానికి ముప్పు ఏర్పడింది. నడిరోడ్డుపై కీచులాడుకున్న ఆ దంపతులు.. ఆ కోపాన్ని పసికందుపై చూపించారు. ముఖ్యంగా భర్తపై ఉన్న కోపంతో భార్య చంటిబిడ్డను నేలకేసికొట్టింది.
 
హైదరాబాద్‌లోని మెహిదీపట్నంలో ఈ దారుణం జరిగింది. భార్య ప్రవర్తనపై భర్త అనుమానం పెంచుకున్నాడు. పుట్టిన బిడ్డ తన బిడ్డ కాదని తెగేసి చెప్పాడు. అంతేనా భర్త నడిరోడ్డుపై పంచాయితీ పెట్టాడు. ఆ చుట్టుపక్కల ఉన్న వారు వారిద్దరినీ వారిస్తుండగానే, తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య, తన ఒడిలో ఉన్న పసికందును నేలకేసికొట్టింది.
 
ఈ ఘటనలో బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ట్రాఫిక్ పోలీసులు కొందరు జరుగుతున్న గొడవను గమనించి, వారిద్దరినీ అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు. గాయాలపాలైన బిడ్డను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలను పలు తెలుగు వార్తా చానళ్లు ప్రముఖంగా ప్రసారం చేస్తున్నాయి.