సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (11:13 IST)

అత్యాచారం కేసులో నిందితుడైన తెరాస ఎమ్మెల్సీ కుమారుడు ఎక్కడ?

అత్యాచారం కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ కుమారుడి ఆచూకీని హైదరాబాద్ నగర పోలీసులు ఇంతవరకు కనుగొనలేదు. ఓ యువతిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేసి ఐదు రోజులు గడుస్తోంది. ఈకేసులో తెలంగాణ రాష్ట్ర సమితికి చె

అత్యాచారం కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ కుమారుడి ఆచూకీని హైదరాబాద్ నగర పోలీసులు ఇంతవరకు కనుగొనలేదు. ఓ యువతిని బలవంతంగా లాక్కెళ్లి అత్యాచారం చేసి ఐదు రోజులు గడుస్తోంది. ఈకేసులో తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన శాసనమండలి సభ్యుడి కుమారుడు ఓ నిందితుడు. అతన్ని హైదరాబాద్ నగర పోలీసులు ఇప్పటివరకు అరెస్టు కాదు కదా.. కనీసం ఆచూకీ కూడా కనుగొనలేక పోతున్నారు. 
 
బ్యూటీ పార్లర్‌లో పనిచేసే ఓ యువతిని ప్రేమపేరుతో నమ్మించిన ప్రీతంరెడ్డి ఈ నెల 6న కొంపల్లిలోని తన ఇంటికి ఆమెను రప్పించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాక తన స్నేహితులైన స్నేహిత్ రెడ్డి, అరవరెడ్డిని కూడా రప్పించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అత్యాచారాన్ని వీడియో కూడా తీసేందుకు ప్రయత్నించారు. వారి చెర నుంచి తప్పించుకుని వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
ఈ ఘటన ఈనెల 6వ తేదీన జరిగింది. ఆ తర్వాత పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఓ యువతి ఫిర్యాదు చేశారు. ముగ్గురు యువకులు తనపై అత్యాచారం చేశారంటూ ఫిర్యాదు చేశారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రీతంరెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కుమారుడు స్నేహిత్ రెడ్డితోపాటు అతడి స్నేహితుడు అరువారెడ్డిని అదుపులోకి తీసుకోవడంలో మీనమేషాలు లెక్కిస్తున్నారు. 
 
వారిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్సీ కొడుకును కేసు నుంచి తప్పించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంలో అధికార పార్టీ నేతల నుంచి పోలీసులపై ఒత్తిడి ఉందని చెబుతున్నారు. కొడుకును రక్షించుకునేందుకు ఎమ్మెల్సీ భూపతి రెడ్డి ఇటీవల పోలీస్ ఉన్నతాధికారులను కలిసినట్టు సమాచారం. యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ప్రీతంరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలినవారు పరారీలో ఉన్నారు.