అదృశ్యమైన టెక్కీ దారుణ హత్య.. బండరాళ్లతో మోది హత్య చేసిన దుండగులు
ఇటీవల హైదరాబాద్ నగరంలో అదృశ్యమైన మహిళా సాఫ్ట్వేర్ ఇంజనీర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఈ మేరకు ఆ టెక్కీ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తలపై బండరాయితో మోది అత్యంత కిరాతకంగా హత్య చేసినట్టు పోలీసులు గుర్తించారు. ఈ వివరాలను పరిశీలిస్తే..
ఇటీవల హైదరాబాద్ నగరానికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ హష్మీ అదృశ్యమయ్యారు. దీనిపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంతలో నగర శివారులోని లింగంపల్లి రైల్వే ట్రాక్ వద్ద పడి ఉన్న మృతదేహం ఉన్నట్టు పోలీసులకు సమాచారం వచ్చింది.
దీంతో పోలీసులు అక్కడకు వెళ్లి చూడగా, ఆ మృతదేహం సాఫ్ట్వేర్ ఇంజినీర్ హష్మిగా గుర్తించారు. గుర్తు తెలియని దుండగులు హష్మిని బండరాయితో మోది హత్య చేశారు. హష్మి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.