మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (19:53 IST)

బలహీన వర్గాలకు చెందిన వాడినే.. కానీ బలహీనుడ్ని కాదు: స్పీకర్ తమ్మినేని

శాసనసభలో టీడీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. 
టీడీపీ సభ్యుల ప్రవర్తన, వారి భాష, వారి తీరు పట్ల ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు ముక్తకంఠంతో ఖండించారు.

 
ఈ పరిణామాలపై స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ..  శాసనసభ స్పీకర్ స్థానానికి ఇచ్చిన సూచనలు, అధికారం మేరకు గౌరవ స్థానానికి భంగం కలిగించేలా ఉన్న ఈ సంఘటనను ఎథిక్స్ కమిటీకి సిఫార్సు చేస్తూ వీలైనంత త్వరగా రిపోర్టు ఇవ్వమని ఆదేశించారు. అంతేగాకుండా బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా తనకు సభానాయకుడు స్పీకర్ గా అవకాశం ఇచ్చారని తమ్మినేని సీతారాం అన్నారు.

"బలహీన వర్గాలకు చెందిన వ్యక్తినే కానీ.. తాను బలహీనుడ్ని మాత్రం కానని" దయచేసి ఈ విషయాన్ని ఆ సభ్యులు గుర్తు పెట్టుకోవాలని స్పీకర్ తమ్మినేని సీతారం స్పష్టం చేశారు. నేను బలహీనుడునో, బలవంతుడునో ప్రతిపక్ష నాయకుడుకు కూడా అనుభవం ఉందని తమ్మినేని వ్యాఖ్యానించారు. దయచేసి ఇలాంటి పరిస్థితి మరోసారి పునరావృతం కాకూడదని కోరారు.

ఇకమీదట పునరావృతం అవుతుందని అనుకోవటం లేదని స్పీకర్ ఆశించారు. ఈరోజుకీ వారి అభిప్రాయాలను స్వాగతిస్తున్నాము. కానీ, బలహీనవర్గాలు, దళిత వర్గాలు,  మైనార్టీ వర్గాలు శక్తిహీనులు కాదని రుజువు చేసే బ్రహ్మాండమైన అవకాశం సీఎం శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చారన్నారు. 

ఎథిక్స్ కమిటీకి ఈ ఘటనను రిఫర్ చేస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం తెలిపారు. తర్వాత దీనిపై ఏమి చేయాలో నిర్ణయిస్తామన్నారు. తన అభిప్రాయాలను తెలియజేయటానికి అవకాశం ఇచ్చినందుకు సభకు  స్పీకర్ తమ్మినేని సీతారాం ధన్యవాదాలను తెలిపారు. 

ఈరోజు శాసనసభలో జరిగిన ఉదంతం చాలా దురదృష్టకరమని స్పీకర్ తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు. శాసనసభ్యునిగా సభలో అడుగుపెట్టినప్పుడే సభ రూల్స్, కన్వెన్షన్స్ను (Rules and Conventions) సభ్యులు ఎవరికి వారు అర్థం చేసుకొని వ్యవహరించాల్సి ఉందని స్పీకర్ తెలిపారు.

దురదృష్టకరం ఏమిటి అంటే చాలా సందర్భాల్లో సభ రూల్స్, కన్వెన్షన్స్ నియమాలు మొత్తం ఉల్లంఘించి గత మూడు రోజులుగా సభ జరుగుతున్న తీరు చాలా ఆక్షేపణీయమన్నారు. అయినా, స్పీకర్ గా ఎందుకు సహిస్తున్నారన్న ప్రశ్న సభ నుంచి ఉత్పన్నం అయింది. అయితే, సహించాలి. మనది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏర్పడ్డ చట్టసభ అని స్పీకర్ తెలిపారు. ఈ చట్టసభకు కొన్ని రాజ్యాంగపరమైన, శాసనసభ సభ్యుల ప్రవర్తనపై నియమావళి ఉందన్నారు.

మనకి ఎవరైతే సభ సాంప్రదాయాలకు విరుద్ధంగా ఆక్షేపనీయంగా వ్యవహరిస్తున్నారో వారిపై చర్యలు తీసుకోవటానికి కమిటీలు కూడా ఉన్నాయి అని తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. ప్రత్యక్షంగా నేను చర్యలు తీసుకునేముందు కొన్ని సాంప్రదాయాలు, రూల్స్ మనం పాటించాలి అన్నారు.

స్పీకర్ (ఓ సభ్యుడ్ని ఉద్దేశించి) ఆయన సీనియర్ సభ్యుడు కూడా అన్నారు. సభా నాయకుడు మార్షల్స్ పిలిపించి వారిని అక్కడ అదుపులో పెట్టండి. వారి స్థానాల్లో కూర్చొపెట్టండి అన్నారు. మార్షల్ పిలిచేటప్పుడు రెజిల్యూషన్ (resolution) ఏది అని సభ్యులు అన్నారు. సస్పెండ్ చేసేటప్పుడు కచ్చితంగా రెజిల్యూషన్ మూవ్ చేసి చేస్తారు.

కానీ ఇక్కడ సభలోనే కూర్చొబెట్టమన్నారు. దానికి  రెజిల్యూషన్  ఉండాలని సభ్యులు అంటున్నారు. దానిపై ఏదైనా ఉంటే గౌరవ సభ్యులు తెలియజేయాలి అని స్పీకర్ కోరారు.  ఉదయం నుంచి సుమారు గంటన్నర, రెండు గంటల కాలం చాలా సహనంతో వెళ్లి కూర్చొండి.. మీకు మాట్లాడే అవకాశం ఇస్తాం అన్నానని చెప్పినట్టు తమ్మినేని సీతారాం గుర్తు చేశారు.

అయితే, మాకు మైక్ ఇస్తే మేం వెళ్లి కూర్చుంటాం అని ప్రతిపక్ష సభ్యులు అంటున్నారు. ఇది ఏమైనా బేరసారాలా? ఒప్పందమా? ఇది శాసనసభ. కొన్ని నియమావళితో కూడుకున్నదని తమ్మినేని తెలిపారు. అవకాశం ఇస్తామని సభాపతిగా నేను చెబితే వారు అది కాదని మీరు ఇస్తేనే మేం వెళ్తామని అన్నారు.

అంటే.. వీరు (ప్రతిపక్ష  సభ్యులు) ముందస్తు ఉద్దేశాలతో వచ్చారని అనుకున్నానని స్పీకర్ అన్నారు. నిన్న కూడా అలాగే వ్యవహరించారని తమ్మినేని సీతారాం గుర్తు చేశారు. పైగా ప్రతిపక్ష  సభ్యులు కూడా మమ్మల్ని సస్పెండ్ చేస్తే మేం వెళ్లిపోతాం అంటున్నారు. ఈ సందర్భంగా సభ్యులను సస్పెండ్ చేయటం బాధాకరం.. అని మీరు వెళ్లండని పదే పదే కోరానని తమ్మినేని సీతారాం అన్నారు.

గౌరవ సభ్యులు వెళ్లి మీరు మీ స్థానాలకు వెళ్లండి. మీ అభిప్రాయాలు  చెప్పండి. తప్పనిసరిగా సహేతుకమైన వాదన ఉంటే ప్రభుత్వం నుంచి సభ నుంచి పూర్తిగా అనుకూలమైన వాదన వస్తుందని చాలా సందర్భాల్లో చెప్పి చెప్పి విసిగిపోయి వారి విజ్ఞతకు విడిచిపెట్టానని తమ్మినేని సీతారాం తెలిపారు.
 
కంటిన్యూస్ స్లోగన్స్ పెట్టి టీడీపీ సభ్యులు సభను డిస్ట్రబ్ చేసే ప్రయత్నం వారు చేశారన్నారు. చివరకు సభ్యులకు ఏమైందో.. అలుపు వచ్చిందో, అలిసిపోయారో వాకౌట్ చేసుకొని వెళ్లిపోయారని అన్నారు. వెళ్లిపోతూ.. స్పీకర్ తాలూకా వ్యవహారశైలిపై సాకుగా చూపిస్తూ వెళ్లిపోయారు.

అవకాశం ఇస్తామని చెప్పినా, కూర్చొకుండా.. చివరకు స్పీకర్ వ్యవహారశైలికి నిరసనగా వెళ్తున్నామనటం ఏంటి? దీన్ని ఏమనుకోవాలని అని తమ్మినేని సీతారాం ప్రశ్నించారు. ఇది కచ్చితంగా ఏదోఒకపూట ప్రజలకు తెలియాలన్నారు. మనం ఈ సభలోకి వచ్చి సభను నడిపించండి. మీ అభిప్రాయాలు తెలియజేయండి. మీకు హక్కులు అవకాశాలు ఉన్నాయి అని తెలిపాము.

స్పీకర్ స్థానం మీకు అవకాశాలు ఇస్తుందని చెప్పామని అన్నారు. పదే పదే రిక్వెస్ట్ చేసినా అదే వాదనతో వారు సభలో గందరగోళం సృష్టించటం ముందస్తు ఆలోచన అంటారా? కాదంటారా? ఇవాళ వాయిదా తీర్మానం ఇవ్వటం ఏంటి? దాని మీద ఏంటో వెంటనే చెప్పండని అడగటం ఏంటని తమ్మినేని సీతారాం నిలదీశారు.

మీరు ఇచ్చిన వాయిదా తీర్మానం చూశాను. దానిపై సరైన సమయంలో నిర్ణయం చెబుతాను అన్నాను. సభలోకి వస్తూనే వారి స్థానాల్లో కూర్చోకుండా నేరుగా పోడియం వద్దకు రావటం ఏంటని స్పీకర్ సభ్యుల తీరుపై విచారం వ్యక్తం చేశారు. 

సభలో 151 మంది వైయస్ఆర్సీపీ సభ్యులు, జనసేన నుంచి ఒక శాసనసభ్యుడు కూడా ఉన్నారు. సభ్యులు శాసనసభ ద్వారా ప్రభుత్వానికి, అధికార యంత్రాంగానికి చెప్పుకోవాలని అనుకుంటారు. వారి హక్కులను హరించే అధికారం ప్రతిపక్షానికి లేదు. గౌరవ సభ్యుడి హక్కులను హరించే అధికారం ఎవ్వరికీ లేదు.

ప్రతిపక్షమే కాదు.. అధికార పార్టీకి లేదు. గౌరవ సభ్యుడి హక్కుల్ని పరరిక్షంచాలి, వారి అభిప్రాయాలు చెప్పుకోవాలి. సభ ద్వారా సభానాయకుడు వింటారు. సాధ్యాసాధ్యాలు విని ప్రభుత్వం చర్యలు తీసుకుంటారు. ప్రజాప్రభుత్వం ఎన్నికైంది.

ఈ ప్రజాప్రభుత్వానికి కొన్ని బాధ్యతలు, కర్తవ్యాలు ఉంటాయి. వాటిని నిర్వర్తించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. ఇవాళ మూడు రాజధానులపై నిర్ణయం జరిగింది. అది ప్రభుత్వ నిర్ణయం. ఆ నిర్ణయం మంచిదా, చెడ్డదా అన్న ప్రజలు నిర్ణయిస్తారని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. 

దానిపై టీడీపీ శాసనసభ్యులు తమ అభిప్రాయాలను చెప్పారు. ఆ బిల్లును సభ ఆమోదించింది. సభ ఆమోదించిన తర్వాత కూడా టీడీపీ సభ్యులు అదే అంశాన్ని పట్టుకొని కూర్చోవటం సరికాదన్నారు.

మీ అభిప్రాయాన్ని మీరు సభలో చెబుతున్నారు. ప్రజలు అందరూ మన తాలూకా వైఖరిని గమనిస్తున్నారు. ఇది దురదృష్టకర పరిణామమని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు.