బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 7 నవంబరు 2019 (18:58 IST)

చంద్రబాబు బండారం బయటపెడతా: స్పీకర్ తమ్మినేని

చంద్రబాబు బండారం బయటపెడతామని, ప్రజలముందు నిలుచోబెట్టి గుడ్డలూడదీస్తామని ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అగ్రిగోల్డ్ విషయంలో గత ప్రభుత్వం కుంభకోణాలకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. హాయ్‌ల్యాండ్ భూములను కొట్టేసేందుకు చంద్రబాబు, లోకేష్ ప్లాన్ వేశారని అన్నారు. అగ్రిగోల్డ్‌తో సంబంధంలేదని చంద్రబాబు ప్రకటించగలరా? అని తమ్మినేని ప్రశ్నించారు.

తనకెంతో అనుభవం ఉందని చెప్పే చంద్రబాబు.. ఆ అనుభవాన్ని మడిచి ఎక్కడో పెట్టుకోవాలని తమ్మినేని అన్నారు. ఎన్నికల ముందు రూ. 10 వేలు ఇస్తానని చెప్పి అందరి దగ్గర పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకుని కూడా ఇవ్వలేదని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వాలే స్కాంలకు పాల్పడితే ప్రజలేమైపోవాలని తమ్మినేని ప్రశ్నించారు. కళ్ల ముందు అన్యాయం జరిగితే స్పీకర్ స్పందించకూడదా అన్నారు. తాను ముందు ఎమ్మెల్యేనని, తర్వాతే స్పీకర్‌నని చెప్పారు.

చంద్రబాబు ప్రతి ఒక్కటీ మాయ చేశారని విమర్శించారు. యనమల రామకృష్ణుడు, సీఎం రమేష్ తదితరులు హాయ్‌ల్యాండ్‌ ఆస్తులను కొట్టేందుకు ప్రయత్నించారని తమ్మినేని ఆరోపించారు.