శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 1 ఫిబ్రవరి 2017 (10:18 IST)

ఏపీ మ్యాప్ ఓ గన్... అందుకే అదంటే అమితమైన ఇష్టం : రామ్ గోపాల్ వర్మ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్ ఓ గన్‌లా ఉంటుందని, అందుకే అది అమితమైన ఇష్టమని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. డిస్ట్రిక్ట్ మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక మ్యాప్ ను తన ట్విట్టర్ ఖాత

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మ్యాప్ ఓ గన్‌లా ఉంటుందని, అందుకే అది అమితమైన ఇష్టమని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వ్యాఖ్యానించాడు. డిస్ట్రిక్ట్ మ్యాప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరిట ఒక మ్యాప్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన వర్మ, ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘గన్’లా కనిపిస్తున్న ఆంధ్రప్రదేశ్ మ్యాప్‌ను తాను ఇష్టపడుతున్నానని ఆ ట్వీట్‌లో వర్మ తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
 
నిన్నామొన్నటి వరకు సినీ నటులను లక్ష్యంగా చేసుకుని తనదైనశైలిలో విమర్శలు, ప్రశంసలు చేస్తూ ట్వీట్లతో విమర్శనాస్త్రాలు సంధించే రామ్ గోపాల్ వర్మ తాజాగా ఏపీ మ్యాప్‌ను లక్ష్యంగా చేసుకుని ట్వీట్ చేయడం గమనార్హం.