1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Updated : బుధవారం, 29 మే 2024 (16:18 IST)

పవన్ కల్యాణ్ పిఠాపురంలో గెలుస్తారని నా యావదాస్తిని పందెం కాస్తా: వర్మ ఛాలెంజ్

Varma-Pawan kalyan
పవన్ కల్యాణ్ పిఠాపురంలో భారీ మెజారిటీతో విజయం సాధిస్తారని పిఠాపురం తెదేపా ఇంచార్జ్ వర్మ జోస్యం చెప్పారు. ఈ విషయంపై ఎవరైనా పందెం కాసేందుకు వస్తే తన యావదాస్తిని పందెంలో పెడతానంటూ సవాలు విసిరారు. మరోవైపు రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేసేది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీయేనంటూ ఆ పార్టీకి చెందిన నాయకులు చెబుతున్నారు.
 
ఇంకోవైపు సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సైతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో విజయం సాధిస్తారని చెప్పుకొచ్చారు. తనకు తెలిసినంత వరకు, పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ గారి గెలుపు లాక్ చేయబడిందనీ, ఆయన ఎంత మెజారిటీతో గెలుస్తారనే దానిపై మాత్రమే చర్చ జరుగుతోందని అన్నారు. అసెంబ్లీకి వెళ్లే అర్హత ఉన్న పవన్‌కి ఇది చాలా అనుకూలమైన ఎన్నికలు అని చెప్పగలను... అంటూ లక్ష్మీనారాయణ అన్నారు.
 
2019లో జేఎస్పీ నుంచి విడిపోయిన తర్వాత పవన్‌కు నాయకత్వ లక్షణాలు లేవని, ఆయన వెంట నడవడం వల్ల ప్రయోజనం లేదని జేడీ అంటుండేవారు.