ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : శుక్రవారం, 20 అక్టోబరు 2023 (14:13 IST)

గుంటూరు యువతితో పోలీస్ కానిస్టేబుల్ రాసలీలలు.. ఎక్కడ?

romance
ఓ యువతితో పోలీస్ కానిస్టేబుల్ ఉండగా, అతని భార్య, బంధువులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు అప్పగించింది. ఈ సంఘటన గురువారం గుంటూరు జిల్లాలో జరిగింది. ఈ వివరాలను పరిశీలిస్తే, జిల్లాలోని నల్లపాడు సీఐ బత్తుల శ్రీనివాస రావు వెల్లడించిన వివరాల మేరకు.. కట్టి శ్రీను అనే వ్యక్తి ఓ పోలీస్ కానిస్టేబుల్. ఈయన గతంలో నల్లపాడు పోలీసు స్టేషనులో కానిస్టేబుల్‌గా పని చేశాడు. ప్రస్తుతం ఎస్ఎఫ్ కొనసాగుతున్నారు. 
 
ఈ క్రమంలో కానిస్టేబుల్ శ్రీను పల్నాడు జిల్లా నాదెండ్లకు చెందిన దివ్యను గతంలో వివాహం చేసుకొని నాదెండ్లలో నివాసం ఉంటున్నారు. కోర్టు పనులపై వచ్చిన సమయంలో శ్రీనుకు దాచేపల్లికి చెందిన యువతితో పరిచయమేర్పడింది. ఆమె ఎస్ఐ పోటీ పరీక్షలు రాసేందుకు కోచింగ్ తీసుకుంటూ గుంటూరులో ఉంటోంది. వీరిద్దరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో వీరిద్దరూ కలిసి అమరావతి రోడ్డు ఐడీ ఆసుపత్రి ఎదురుగా ఉన్న అపార్టుమెంట్‌లో కొంతకాలంగా కలిసి ఉంటున్నారు. యువతి మోజులో పడిన కానిస్టేబుల్ శ్రీను భార్య, బిడ్డను పట్టించుకోవటం లేదు. దీంతో దివ్య ఆరా తీయగా తన భర్త వేరే యువతితో ఉంటున్నట్లు తెలిసి పలుమార్లు భర్తను నిలదీసింది. యువతిని సైతం హెచ్చరించింది. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు.
 
దీంతో గురువారం దివ్య తన భర్త సదరు యువతితో ఇంటిలో ఉన్న సమయంలో అక్కడకు వెళ్లి బయటకు రావాలని కేకలు వేసింది. శ్రీను తలుపులు తీయలేదు. ఈ విషయం నల్లపాడు పోలీసులకు చెప్పడంతో వారు వచ్చి గదిలో ఉన్న ఇద్దరిని బయటకు రప్పించారు. కానిస్టేబుల్ మెట్లు దిగి వెళ్లేందుకు ప్రయత్నించగా అతని భార్య, బంధువులు అతని నిలవరించే క్రమంలో జరిగిన పెనుగులాటలో శ్రీను చొక్కా చిరిగిపోయింది. 
 
నల్లపాడు పోలీసులు వారిద్దరిని ఆటోలో ఎక్కించుకుని స్టేషన్‌కు తరలించే సమయంలో దివ్య ఆటోకు అడ్డుపడింది. ఏదైనా ఉంటే స్టేషన్‌కు వచ్చి మాట్లాడుకోమని పోలీసులు ఆమెను బలవంతంగా పక్కకు నెట్టి కానిస్టేబుల్ శ్రీను, యువతిని స్టేషన్‌ను తరలించారు. ఇరువర్గాలకు చెందిన పెద్దలు స్టేషన్‌కు చేరుకుని రాజీ ప్రయత్నాలు చేపట్టారు. కానిస్టేబుల్‌పై  శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సీఐ వెల్లడించారు.