గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 7 జులై 2023 (11:37 IST)

రెండు తెలుగు రాష్ట్రాలకు వర్షాల హెచ్చరిక

దేశంలోని రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రభావం కొనసాగుతోంది. దీంతో పలు చోట్ల ఇప్పటి వర్షాలు కురుస్తున్నాయి. ఈ రుతుపవనాల ప్రభావంతో మరో రెండు రోజుల పాటు ఈ రెండు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.

ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని మహబూబా బాద్, ములుగు, ఉమ్మడి వరంగల్, భూపాలపల్లి, జనగామ జిల్లాల్లో గురువారం రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఈ భారీ వర్షాల కారణంగా కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ మండలం అందవెల్లి పెద్దవాగుపై ఉన్న తాత్కాలిక వంతెన కొట్టుకునిపోయింది. అలాగే, తెలంగాణాలోని 18 జిల్లాలలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. 
 
అందవెల్లి అప్రోచ్ రోడ్డు వర్షం ధాటికి కొట్టుకుపోవడంతో నాలుగు మండలాలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. వాగు దాటేందుకు ప్రయత్నించిన దహేగాం బీబ్రా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నీటిలో కొట్టుకునిపోయాడు. అతడి అచూకీ ఇంకా లభించలేదు.

రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి పాటి నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఎగువ కురుస్తున్న వర్షాలకు కాళేశ్వరం ప్రాజెక్టుకు జలకళ సంతరించుకుంది. వరద నీటిని ఇతర ప్రాజెక్టులకు అధికారులు తరలిస్తున్నారు. విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో రైతులు కూడా సాగు నీటిలో బిజీ అయ్యారు.