ఏపీకి పురంధేశ్వరి.. తెలంగాణాకు కిషన్ రెడ్డి - బీజేపీ పగ్గాలు అప్పగింత
భారతీయ జనతా పార్టీ పెద్దలు కీలక నిర్ణయం తీసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల అధ్యక్షులను మార్చివేసింది. ఇందులోభాగంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దగ్గుబాటి పురంధేశ్వరి, తెలంగాణాకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్లను ఖరారు చేసింది. కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, షెకావత్‌తో పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షులను ఖరారు చేశారు.
ఏపీ బీజేపీ శాఖ అధ్యక్ష పదవి రేసులో సత్యకుమార్, సుజనా చౌదరి పేర్లను వినిపించినప్పటికీ చివరకు ఊహించని విధంగా ఆ పదవి పురంధేశ్వరికి దక్కింది. మరోవైపు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమించింది.