బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 11 డిశెంబరు 2021 (16:21 IST)

టాటా ప్రవేష్‌ బ్రాండ్‌ పేరు దుర్వినియోగం చేయడంపై కేసు నమోదు

గుంటూరు: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసుల సహాయంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, గుంటూరు జిల్లా పిడుగురాళ్ల వద్దనున్న శ్రీ కోదండరామా ఇంటీరియర్స్‌పై డిసెంబర్‌ 6వ తేదీన దాడులు జరిపి టాటా ప్రవేష్‌ బ్రాండ్‌ పేరుతో నకిలీ ఉత్పత్తులను స్వాధీనం చేసుకోవడంతో పాటుగా బ్రాండ్‌ పేరు దుర్వినియోగం చేయడంపై కేసులు నమోదు చేశారు. అసలైన టాటా ప్రవేష్‌ యొక్క తలుపులు, కిటికీలను కేవలం ఆధీకృత డీలర్లు మరియు డిస్ట్రిబ్యూటర్లు మాత్రమే విక్రయిస్తారు.
 
మోసపూరిత కార్యకలాపాలు జరుగుతున్నాయన్న సమాచారం అందుకున్న అనంతరం, టాటా స్టీల్‌‌తో పాటుగా ఆంధ్రప్రదేశ్‌ పోలీసులు ఉమ్మడిగా దాడులు జరిపి, హోర్డింగ్స్‌, బోర్డులు మరియు టాటా ప్రవేశ్‌ లోగోతో ఉన్న అన్ని స్టిక్కర్లను స్వాధీనం చేసుకున్నారు. టాటా ప్రవేష్‌ పేరును అనధికారికంగా వినియోగించడమన్నది టాటా స్టీల్‌ యొక్క మేథో సంపత్తి హక్కులను ఉల్లంఘించడమే!
 
శ్రీ కోదండ రామా ఇంటీరియర్స్‌  యజమానులు నాసిరకం నాణ్యత కలిగిన నకిలీ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. వీరు తలుపులు మరియు కిటికీలను టాటా ప్రవేష్‌ పేరిట విక్రయిస్తున్నారు. తమ ఔట్‌లెట్‌లో ఇవి లభిస్తున్నాయని ప్రకటించడం ద్వారా  కొనుగోలుదారుల మనస్సుల్లో గందరగోళం సృష్టించారు.
 
టాటా స్టీల్‌ యొక్క ఉత్పత్తులు అసాధారణ ఆదరణను వినియోగదారుల నడుమ పొందాయి. నాణ్యమైన ఉత్పత్తులకు చిరునామా టాటా ఉత్పత్తులని వారి మనసుల్లో బలంగా నాటుకుని పోయింది. ఈ తరహాలో ఆధీకృతం కాకుండా టాటా యొక్క పేర్లను ఉత్పత్తులపై వినియోగించడమన్నది, మరీ ముఖ్యంగా టాటా స్టీల్‌ ఉత్పత్తుల నాణ్యతా ప్రమాణాలను  అసలు అందుకోలేనటువంటి ఉత్పత్తులను టాటా ఉత్పత్తులుగా విక్రయించడమన్నది టాటా స్టీల్‌ గౌరవానికి భంగం కలిగిస్తుంది.
 
టాటా స్టీల్‌ మరియు టాటా సన్స్‌ యొక్క లోగోలు మరియు ట్రేడ్‌మార్క్‌లను ఎలాంటి అనుమతులు లేకుండా వినియోగించి, దుర్వినియోగం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా బ్రాండ్‌ పరపతి మరియు గుడ్‌విల్‌ కాపాడుకోవడంలో భాగంగా టాటా స్టీల్‌ యొక్క బ్రాండ్‌ ప్రొటెక్షన్‌ టీమ్‌ స్ధిరంగా పర్యవేక్షిస్తుండటంతో పాటుగా బ్రాండ్‌ యొక్క మేథోసంపత్తి హక్కులకు భంగం కలిగించే సంస్ధలతో పాటుగా మోసగాళ్లపై తగిన చర్యలను తీసుకుంటుంటుంది.
 
తమ ఆస్తులతో పాటుగా భారీ సంఖ్యలో వినియోగదారులపై ప్రతికూల ప్రభావం చూపే ఎలాంటి చట్ట విరుద్ధ కార్యకలాపాలు అయినా తగిన చర్యలను తీసుకోవడంలో టాటా స్టీల్‌ తమ ప్రయత్నాలను కొనసాగిస్తుంది.