నిర్మల సీతారామన్ కు కూడా భయపడతారా?: జగన్ పై సిపిఐ సెటైర్లు

cpi ramakrishna
ఎం| Last Updated: ఆదివారం, 28 జూన్ 2020 (11:33 IST)
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సెటైర్లు వేశారు. 'ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మోడీకి భయపడతారని తెలుసు కానీ నిర్మల సీతారామన్ కు కూడా భయపడతారా?' అంటూ ఎద్దేవా చేశారు.

"కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ ఏపీకి విద్యుత్ ను రు.2- 70 పైసలకు అందిస్తుంటే ఏపీలో రు.9కు అమ్ముతున్నారన్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కల్లం మాట్లాడుతూ ఏపీ వద్దంటున్నా ఎన్టీపీసీ నుండి యూనిట్ రు.9-84 పైసలకు కేంద్రం అంటగడుతున్నాదని చెప్పారు.

కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వ్యాఖ్యలు రైటా? లేక ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారులు అజయ్ కల్లం వ్యాఖ్యలు కరెక్టా? అని ప్రశ్నిస్తున్నాం.

కేంద్రమంత్రి పక్కాగా అవాస్తవాలు మాట్లాడుతుంటే ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదు? అని నిలదీశారు.దీనిపై మరింత చదవండి :