శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 3 జులై 2020 (10:51 IST)

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఆరోపణలు చేయడం తగదు: భారత న్యాయవాదుల సంఘం

ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి మీద అనవసరమైన అర్థరహితమైన, అవాస్తవాలతో కూడిన అంశాలను పొందుపరిచి వ్యక్తిగత ఆరోపణలు దురుద్దేశ పూర్వకంగా చేయడం, న్యాయవ్యవస్థను అవమాన పరచాలనే దురాలోచనతో కొందరు చేస్తున్న తప్పుడు ఆరోపణలను భారత న్యాయవాదుల సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండిస్తుంది అని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మరియు ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ సభ్యులు ముప్పాళ్ళ సుబ్బారావు ఓ ప్రకటనలో తెలిపారు. 
 
హంసరాజ్ అనే తెలంగాణకు చెందిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి  గురించి అర్థంలేని ఆరోపణలు చేయడం దురదృష్టకరమని దీని వెనుక కొన్ని శక్తులు పని చేస్తున్నట్లుగా ప్రజలు భావిస్తున్నారని, ఇతను  తెలంగాణ రాష్ట్రంలో ఉండటంవల్ల ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ఏం జరుగుతుందో పాపం అర్థం అయి ఉండదు.

కాబట్టి ఇటువంటి తప్పుడు ఆరోపణలతో న్యాయవ్యవస్థను కించ పరచడం ద్వారా అతను న్యాయవ్యవస్థను ఏమీ చేయలేడని, సాక్షి లాంటి పత్రికలో తప్పుడు ఆరోపణలతో కూడిన వార్తలు రాయించి నంత మాత్రాన న్యాయవ్యవస్థ రాజ్యాంగానికి, చట్టాలకు  వ్యతిరేకంగా ఎప్పుడూ పనిచేయదని అది గమనించి మెలగాలని ఆయన హెచ్చరించారు.
 
ఇటీవల కాలంలో కొందరు రాజకీయ దురుద్దేశంతో న్యాయవ్యవస్థ మీద వివిధ రకాలుగా దాడికి పూనుకున్న విషయం అందరికీ విధితమే దానిలో భాగమే అవాస్తవాలతో కూడిన ఇటువంటి తప్పుడు ఆరోపణలు కొందరు చేస్తున్నారని న్యాయవాదులు, ప్రజలు గమనించాలని అని ముప్పాళ్ళ అన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా 16 జడ్జిమెంట్లు ఇవ్వటం వలన ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, ఇటువంటి ఆరోపణలు చేయటం వల్ల సానుకూల తీర్పులు వస్తాయని దురాలోచనతో కొందరు కుట్ర పూరితంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది అన్నారు.

హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కోవిడ్ లాక్ డౌన్ ను దృష్టిలో ఉంచుకొని ఎప్పటికప్పుడు ఆన్ లైన్ ద్వారా మాత్రమే ఫైలింగ్ చేసే విధంగా ఎప్పటికప్పుడు ఆదేశాలిస్తూ చర్యలు తీసుకుంటున్నారని విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని న్యాయవాదులకు, న్యాయమూర్తులకు, సిబ్బందికి, కక్షిదారులు అందరికీ తెలిసిన విషయమేనని, కరోనా దృష్ట్యా భౌతికంగా కేసులు దాఖలు చేసుకోవడానికి ఎటువంటి అనుమతులు ఇవ్వకుండా ఎప్తపటికప్పుడు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద ఇటువంటి ఆరోపణలు చేయటం తగదని ఆయన అన్నారు. 

దివంగతులైన ఇన్చార్జి రిజిస్ట్రార్ జనరల్ బి.రాజశేఖర్ మరణానికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కారణమని పేర్కొనటం హాస్యాస్పదమని, రాజశేఖర్ కి,వారి భార్యకి,అటెండర్ కు ది.15-6-2020 న ప్రభ్యుత్వమే కోవిడ్ టెస్టులు చేయగా నెగటివ్ వచ్చినదని ఆయన అన్నారు.

అయన మరణించినది 24-06-2020న అంటే వారానికి ముందుగానే టెస్ట్ లు చేయడం జరిగినది ఈ వాస్తవాలను మభ్యపెట్టి ప్రధాన న్యాయమూర్తి మీద తప్పుడు ఆరోపణలు చేయడం వెనుక కొన్ని శక్తులు,ప్రభుత్వ లబ్ది పొందుతున్న కొందరు విశ్రాంత న్యాయమూర్తుల పాత్ర కూడా ఉన్నట్లుగా సమాచారం తెలుస్తందని అయన అన్నారు.

న్యాయస్థానం ఇటీవల ఇస్తున్న న్యాయబద్ధ మయిన  తీర్పులను ఒర్వలేని వారు,రాజకీయ దురుద్దేశంతో ఇటువంటి అవాస్తవాల్తో కూడిన ఆరోపణలను ప్రోస్తహిస్తున్నారని భారత న్యాయవాదుల సంఘం ఇటువంటి వాటిని ఖండిస్తుందని అయన అన్నారు. ఇటువంటి తప్పుడు ఆరోపణల న్యాయ వ్యవస్థ మీద చేసిన వారి  తక్షణమే చర్యలు తీసుకోవాలని అయన డిమాండ్ చేసారు.