రాంకీ ఛైర్మన్ ఇంట్లో ఐ.టి.సోదాలు, వైసీపీ ఎంపీకీ తప్పలేదా?
వైసీపీ ఎంపీ, రాంకి గ్రూపు చైర్మన్ అయోధ్య రామిరెడ్డి నివాసంలో ఐటీ సోదాలు మొదలయ్యాయి. హైదరాబాదులో 15 చోట్ల ఇన్ కం టాక్స్ టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. ఎంపీ అయోధ్య రామిరెడ్డికి చెందిన గచ్చిబౌలి నివాసంలో సోదాలు చేశారు.
అదేవిధంగా ఏకకాలంలో గచ్చిబౌలి రాంకి ప్రధాన కార్యాలయంలోనూ సోదాలు జరిపారు. దీనితోపాటు రాంకి అనుబంధ సంస్థల్లో సైతం ఐటీ సోదాలు చేస్తోంది. 15 బృందాలు వివిధ ప్రాంతాల్లో ఐటీ సోదాలు చేస్తున్నాయి.
మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డి. పార్టీకి ఈ అన్నదమ్ములు ఇద్దరు చేసిన సేవకు ప్రతిఫలంగా ఏపీ సీఎం, వైసీపీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి ఇటీవల అయోధ్య రామిరెడ్డికి రాజ్యసభ టిక్కెట్ ఇచ్చారు.
ఒక పక్క ఏపీ సీఐడి ఎంపీ రఘురామపై దాడులు చేస్తున్న తరుణంలో, అదే పార్టీకి చెందిన ఎంపీ ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి కంపెనీ రాంకీపై కేంద్రం ఐ.టి. దాడులు జరపడం యాధృచ్చికం అయినా, రాజకీయ సమీకరణాలను తలపిస్తోంది.