శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 18 నవంబరు 2021 (16:03 IST)

గ్రేట్ అచ్చెన్న.. పెద్దాయన అడిగితే చేయకుంటే ఎలా..? బాబు ముఖం చూడాలి..?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ బీఏసీ సమావేశంలో ఏపీ మాజీ సీఎం చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా నెల్లూరు, కుప్పం మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో ప్రస్తావన వచ్చినట్టుగా సమాచారం. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ సభకు చంద్రబాబును తీసుకురావాలని అన్నారు. కుప్పం ఫలితాల తర్వాత చంద్రబాబు మొహం చూడాలని ఉందని వ్యాఖ్యానించారు. 
 
ఈ సందర్భంగా టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందిస్తూ ఎన్నికల్లో గెలుపు ఓటములు సర్వ సాధారణమేనని చెప్పుకొచ్చారు. అంతేగాకుండా.. బీఏసీ సభకు కచ్చితంగా చంద్రబాబు వస్తారని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే జగన్ మాట్లాడుతూ.. కుప్పం గురించి మాట్లాడేందుకు చాలా ఉన్నాయని వ్యాఖ్యానించారు.
 
ఇక, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి.. ఒక్క రోజే సభ జరుపుదామని భావిస్తున్నామని స్పీకర్ తమ్మినేని సీతారాం చెప్పారు. అచ్చెన్నాయుడు స్పందిస్తూ.. చాలా సమస్యలపై చర్చ జరగాల్సి ఉందని.. 15 రోజులు సమావేశాలు జరపాలని కోరారు. 
 
దీనిపై స్పందించిన జగన్.. ‘గ్రేట్ అచ్చెన్నాయుడు.. పెద్దాయన అడిగితే అంగీకరించకుంటే ఎలా..?’ అని వ్యాఖ్యానించారు. నవంబర్ 26 వరకు సభ జరుపుదామని జగన్ అన్నారు. సభలో అర్ధవంతమైన చర్చలు జరిగేలా చూడాలని కోరారు.