శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 జూన్ 2021 (23:01 IST)

జగన్ ఫేక్ ముఖ్యమంత్రి: కొమ్మారెడ్డి పట్టాభిరామ్

రాష్ట్రాన్ని పాలిస్తున్నది ఫేక్ ముఖ్యమంత్రని, ఫేక్ ప్రభుత్వమని తొలినుంచీ టీడీపీ చెబుతూనేఉందని, ఫేక్ ముఖ్యమంత్రి తనఅంకెలగారడీతో మరోసారి అడ్డంగా దొరికిపోయాడని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ స్పష్టంచేశారు. బుధవారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయకార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. 
ఆ వివరాలు ఆయన మాటల్లోనే యథాతథంగా మీకోసం...!

కోవిడ్ సందర్భంగా వ్యాక్సినేషన్ కు సంబంధించి, ఎన్ని వ్యాక్సిన్లు ఇచ్చారో, జూన్ లో 1 నుంచి 22వతేదీవరకు ఎన్ని డోసుల వ్యాక్సిన్లు ఇచ్చారోచెబుతూ, ఫేక్ ముఖ్యమంత్రి, ఫేక్ ప్రభుత్వం తప్పుడుసమాచారంతో ప్రజలను మోసగించాలని చూసింది.  ఆరోగ్యాంధ్ర ట్విట్టర్ లో ఈరోజు ఒక ట్వీట్ పెట్టారు. అదిచూసిఆశ్చర్యపోయాను.

46.46 మిలియన్లు అంటే 4కోట్ల60లక్షల డోసులవ్యాక్సిన్లను జూన్ లోనే అందిం చారని, 5కోట్ల80లక్షలమందికి వ్యాక్సినేషన్ పూర్తయిందని ఆ ట్వీట్ లోచెప్పారు. మరలాగొప్పగా దానిపై అనుమానం రాకుండా, ఒక్కొక్క వ్యాక్సిన్ వయొల్ ని బ్రహ్మండంగా వాడామని, మైనస్ 6శాతం మాత్రమే వృథా అయ్యాయని కూడాచెప్పారు. ప్రభుత్వానికి దురదృష్టవశాత్తూ ఒక మిలియన్ కి ఎన్నిలక్షలుంటాయనికూడా తెలియదు.

సమాచారంలో లక్షలను కోట్లుగా చూపించారు.  అదే ట్వీట్ కింద ఉన్నసమాచారాన్ని పరిశీలించాను. జూన్ 1 నుంచి 22వతేదీవరకు 58లక్షల74వేల201డోసులు ఇచ్చినట్టు చెప్పారు. కానీ జూన్ 1 నుంచి 22వరకు ఇచ్చిన వ్యాక్సిన్ల వివరాలను మొత్తం లెక్కిస్తే 39 లక్షల89వేల671 వచ్చింది. కానీ ట్వీట్ కింద తాటికాయంత అక్షరాలతో 58లక్షల 74వేల201డోసులని రాశారు.

దాదాపుగా 19లక్షలు పెంచేశారు. ఎన్నివ్యాక్సిన్ డోసులు వచ్చా యనేది కూడా పరిశీలిద్దాం. 46లక్షల46వేల400 డోసులు వచ్చాయంటున్నారు. వచ్చిన డోసులన్నీ కూడితే మాకు వచ్చినలెక్క 41లక్షల10,530.  జూన్ 1 కి అంతకుముందు నెలలో మిగిలిన స్టాక్ ఉంటుంది కదా అనిభావించి, ఆ లెక్క కూడా బయటకు తీశాం.  మే నెలకి సంబంధించి జూన్ 1కి, 59వేల ఓపెనింగ్ స్టాక్ మాత్రమే ఉంది.

అదికూడా కలిపితే 41లక్షల69వేలు మాత్రమే అవుతుంది. కానీ వీరు ఎంత చెబుతున్నారయ్యా....46లక్షల46వేలు.  అంటే 5లక్షల 25వేలవరకు కలిపారు. ఇచ్చిన వ్యాక్సినేషన్ డోసుల్లోనేమో  19లక్షలవరకు కలిపారు.. ఈరకంగా ప్రజలకు ఏదో ఒకటిచెబితే సరిపోతుంది అనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డికి పెద్దగా చదువుసంధ్యలు లేవు. కూడికలు తీసివేతలు, అంకెలుచదవడంకూడా రాదు.

ఆయనకు రాకపోతే ప్రజలకు కూడా రావనుకుంటున్నారా? ఫేక్ ముఖ్యమంత్రికి లెక్కలు, కూడికలు, తీసివేతలు రాకపోతే మాకురావా? ప్రజలు మరీ అంతగొర్రెల్లా కనిపిస్తున్నారా ఫేక్ ప్రభుత్వానికి? చేతిలో అవినీతిపత్రికఉందికదా అని ఏది పడితేఅది రాసేస్తారా? ప్రజలెవరూ లెక్కలు వేసుకోరని అనుకుంటున్నారా? ఫేక్ ప్రభుత్వం, ఫేక్ లెక్కలు చెబుతుందని తెలిసే అంతా క్షుణ్ణంగా ఒకటికి రెండుసార్లు పరిశీలిస్తున్నాం.

జూన్ 1 నుంచి 22వరకు వాస్తవంగా ఇచ్చిన వ్యాక్సిన్లు 39లక్షల 89వేలయితే, 58లక్షల74వేలనిరాస్తారా? ఇష్టమొ చ్చినట్లు ట్వీట్లుపెడతారా?  వచ్చిన వ్యాక్సిన్లు ఓపెనింగ్ బ్యాలెన్స్ కలిపినాకూడా 41లక్షల69వేలైతే, 46లక్షల 46వేలని చెబుతారా? వచ్చినడోసుల్లో, ప్రజలకుఇచ్చిన డోసుల్లో అంతా ఫేక్ లెక్కలే. ఇవి ఎప్పుడైతే ప్రజలముం దుంచామో.. వెంటనే ట్వీట్ తీసేశారు. దొంగలెక్కలు బయట పడేసరికి వెబ్ సైట్ లోని అంకెలుతొలగిస్తారా?

కానీ ఇప్పటికే వాటినిటీడీపీ ప్రజలముందు ఉంచేసింది. ఫేక్ ప్రభుత్వం చెప్పే ఫేక్ లెక్కలనుప్రజలు నమ్మవద్దనికోరుతు న్నాం. మేమేనెంబర్ 1 అంటూ ప్రజలను మోసగించే పనిలో ఉన్నారు. దాదాపు 19లక్షల వ్యాక్సిన్ డోసులు ప్రజలకు ఇవ్వకుండానే ఇచ్చేశామని దొంగలెక్కలతో ప్రభుత్వం అడ్డం గా దొరికిపోయింది. 

జూన్ 1 నుంచి 22వరకు ప్రభుత్వం వాస్తవంగా ఇచ్చిన వ్యాక్సిన్లు 39లక్షల89వేలయితే, దేశంలోని అనేకరాష్ట్రాలు ఎలాఇచ్చాయో కూడా చూద్దాం.  జూన్ 1 నుంచి 22వరకు మహారాష్ట్ర 60లక్షల70వేలవ్యాక్సిన్లు ఇచ్చింది. ప్రతిరోజు సగటున 2లక్షల75వేలవ్యాక్సిన్లు ప్రజలకుఇచ్చింది. రాజస్థా న్ లో 50లక్షల85వేలడోసులిచ్చారు. రోజుకి 2లక్షల13వేల వ్యాక్సిన్ డోసులిచ్చారు. ఉత్తరప్రదేశ్ లో అత్యధికంగా 88లక్షల53వేలడోసులుఇచ్చారు.

ప్రతిరోజూ 4లక్షల2వేల డోసులచొప్పునఇచ్చారు. కర్ణాటకలో 63లక్షల59వేల డోసులు, రోజుకి 2లక్షల89వేలచొప్పున ఇచ్చారు.  పశ్చిమబెంగాల్లో రోజుకి 2లక్షల23వేలచొప్పున,  49లక్షల22వేల డోసులుఇచ్చారు. గుజరాత్ లో   59లక్షల 21వేలడోసులు, (రోజుకి2లక్షల69వేలు), మధ్యప్రదేశ్ లో 55లక్షల93వేలడోసులు (రోజుకి 2లక్షల54వేలు), అదే మనరాష్ట్రంలో ఇచ్చింది మాత్రం కేవలం 39లక్షల89వేలు మాత్రమే, రోజుకి లక్షా89వేలు మాత్రమే ఇచ్చారు.

ముఖ్య మంత్రికి ఈలెక్కలన్నీ తెలుసా? ఇప్పుడుచెప్పండి ఎవరు దేనిలో నెంబర్ -1 గాఉన్నారో. జగన్ రెడ్డి అన్నింటిలో అట్టడుగునే ఉన్నారు. ఆ విషయం ఆయన ఎంతత్వరగా గ్రహిస్తే అంతమంచిది.  తలసరిన జూన్ 21వతేదీన ఎన్నిడోసులిచ్చారో అదికూడా చూద్దాం.  జూన్ 21న  తలసరిన 0.17శాతం మాత్రమే డోసులిచ్చారు. అది దేశస్థాయిలో రాష్ట్రాన్ని22వస్థానానికి దిగజార్చింది. ఇదేనా ముఖ్యమంత్రి ప్రతాపం, సమర్థత?

జూన్ 20వతేదీన తామే నెంబర్ 1 అనిచెప్పారు కదా? జూన్ 21నాటికే 22వస్థానానికి ఎలా పడిపోయారు? మనకంటే అధికజనాభా ఉన్న రాష్ట్రాలైన మధ్యప్రదేశ్ పర్ కేపిటా 2.8శాతముంటే, కర్ణాటక 2.22శాతం,  గుజరాత్ 1.39శాతం, ఉత్తరప్రదేశ్  0.46 శాతంతో ఉన్నాయి.  జూన్ 21న రాష్ట్రంలో పరిస్థితి అలాఉంటే, 22వ తేదీన   తొలిదశ వ్యాక్సిన్లలో రాష్ట్రం 22వస్థానంలోఉంది.  జూన్ 22న 36,886 మందికి మాత్రమే తొలిడోస్ ఇచ్చారు.

ఇది దేశవ్యాప్తంగా ఇచ్చిన తొలిడోసు వ్యాక్సిన్లలో కేవలం 0.68శాతం మాత్రమే.  నిన్నదేశవ్యాప్తంగా 60 లక్షల69వేల982 మందికి వ్యాక్సిన్లుఇస్తే, రాష్ట్రంలో మాత్రం 42,891 మందికి మాత్రమే ఇచ్చారు.   జూన్ 22నాటికి రెండో డోస్ వ్యాక్సిన్లలో 19వస్థానంలోఉంది. జూన్ 22న కేవలం 6,198మందికి మాత్రమే రెండోడోస్ వ్యాక్సిన్ ఇచ్చారు. ఇది జూన్ 22న దేశవ్యాప్తంగా ఇచ్చిన రెండో డోస్ వ్యాక్సిన్లలో 0.89శాతం మాత్రమే. 

ఇలాఉంటే దేనిలో నెంబర్ -1లో ఉన్నామని చెప్పుకుంటున్నారు. జూన్ 22వతేదీ వరకు 27లక్షల52వేల28మందికి మాత్రమే రెండుడోసుల వ్యాక్సిన్ వేసినట్టు చెప్పారు. ఇది మొత్తం జనాభాలో 71.6శాతం మాత్రమే. ఇంకా ఇప్పటికీ 85లక్షల84వేల106మంది రెండోడోసుకోసం ఎదురు చూస్తున్నారు.  వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి వెబ్ సైట్లలో తప్పుడు లెక్కలుపెడతారా?

ఫేక్ ముఖ్యమంత్రి తప్పుడులెక్కలతో తానుదేశంలోనే పెద్ద ఫేక్ ముఖ్యమంత్రినని రుజువు చేసుకున్నాడు. ఎవరైనా సరే కేంద్రప్రభుత్వ కోవిడ్ వెబ్ సైట్లో చెక్ చేసుకోవచ్చు.  కోవిడ్ వ్యాక్సినేషన్లు ఇవ్వడంలో దేశ మంతా సిగ్గుపడేలాప్రభుత్వ పనిచేస్తోంది. ముఖ్యమంత్రి తన వైఫల్యాలనుకప్పిపుచ్చుకోవడానికి తప్పుడులెక్కలు చెబు తున్నాడు. ప్రజలంతా ముఖ్యమంత్రి తీరుని అర్థంచేసుకోవా లి. మిగతారాష్ట్రాలతో పోలిస్తే ఏపీ వ్యాక్సినేషన్ ప్రక్రియలో చాలా వెనుకబడిఉంది.

గడచిన 22రోజుల్లో మహారాష్ట్రలో 60లక్షల70వేలవ్యాక్సిన్లు ఇచ్చారు. రాజస్థాన్ లో50లక్షల 85వేలు, ఉత్తరప్రదేశ్ లో 88లక్షల83వేలు, కర్ణాటకలో 63లక్షల 59వేలు, పశ్చిమ బెంగాల్లో 49లక్షలు, గుజరాత్ లో 59లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. మనరాష్ట్రంలో మాత్రం 39లక్షల89వేలు ఇచ్చారు. ఇవన్నీ చూశాక ఈముఖ్యమం త్రి ఎలా నెంబర్ 1 అవుతాడో ఆ దేవుడికేతెలియాలి.

రెండుడోసుల వ్యాక్సిన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగ వంతంచేయాలి. లేకుంటే ప్రజలప్రాణాలకే ప్రమాదం. జూన్ 20న 13లక్షల వ్యాక్సిన్లు ఇచ్చామనిచెప్పుకున్న ప్రభు త్వం, ఆమరుసటిరోజునే 13లక్షలనుంచి 40వేలకు పడిపో యింది. ఎందుకు పడిపోయిందో ముఖ్యమంత్రే చెప్పాలి. పర్ కేపిటా డోసుల్లో 22వస్థానానికి ఎందుకు పడిపోయామో కూడా ముఖ్యమంత్రే ప్రజలకు సమాధానంచెప్పాలి.

ప్రభుత్వ మిచ్చే తప్పుడులెక్కలు నమ్మి ప్రజలుమోసపోవద్దని కోరు తున్నాం. తొలిడోసు, రెండోడోసు ఇవ్వడంలో రాష్ట్రం అనేక విధాలా వెనుకబడే ఉంది. ఆరోగ్యఆంధ్రా ట్విట్టర్ అకౌంట్ తో, తప్పుడులెక్కలతో ముఖ్యమంత్రి ప్రజలను మోసగించాలని చూస్తున్నాడు. బాధ్యతగలప్రతిపక్షం ముఖ్యమంత్రి ఫేక్ లెక్కలను ఆధారాలతోసహా బయటపెట్టింది. కోవిడ్ పై టీడీపీ లేవనెత్తిన పది డిమాండ్లనుప్రభుత్వం తక్షణమే అమలుచే యాలి.

తప్పుడు లెక్కలతో ప్రజలను మోసగించడమనేది  ముఖ్యమంత్రిస్థానంలో ఉన్నవ్యక్తికి గౌరవప్రదం కాదు. లోపా లను ఎత్తిచూపుతున్న ప్రతిపక్షాన్ని గౌరవించి, ప్రజలకోసం సక్రమంగా బాధ్యతతో పనిచేయాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేస్తున్నాం.