సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 అక్టోబరు 2021 (15:12 IST)

మిలాద్‌ ఉన్‌ నబీ.. రేపు సెలవు ప్రకటించిన జగన్ సర్కారు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం రేపటి రోజున ప్రభుత్వం హాలీ డే ప్రకటించింది. ఈద్‌ మిలాద్‌ ఉన్‌ నబీ సందర్భంగా బుధవారానికి బదులు మంగళవారం ప్రభుత్వ సెలవును ప్రకటిస్తూ… గవర్నమెంట్‌ ఉత్తర్వులు జారీ చేసింది జగన్‌ సర్కార్‌. ఏపీ స్టేట్‌ వక్ఫ బోర్డు సీఈవో సూచనల మేరకు రేపు సెలవు ప్రకటించింది జగన్‌ సర్కార్‌. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం.
 
ముస్లింలు.. మహ్మద్‌ ప్రవక్త జన్మ దినాన్ని మిలాద్‌ ఉన్‌ నబీ గా జరుపుకుంటారు. ఇస్లాం క్యాలెండర్‌ ప్రకారం… మూడో నెల రబీ అల్‌ అవ్వల్‌‌లో పౌర్ణమి ముందు రోజు మహ్మద్‌ ప్రవక్త జన్మించినట్లు చరిత్ర చెబుతోంది.
 
సర్వమానవాళి శ్రేయస్సు.. శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్‌ ను ఎన్నుకున్నట్లు పవిత్ర ఖురాన్‌ షరీఫ్‌ లో చెప్ప బడింది. విశ్వ ప్రవక్త మహమ్మద్‌ కేవల్ ముస్లింల కోసం కాదని..ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లాహ్‌ నియమించారని అందులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రేపటి రోజున ప్రభుత్వ సెలవును ప్రకటించింది సర్కార్‌.