ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 డిశెంబరు 2020 (23:07 IST)

జగన్ మరోసారి ప్రజలను మోసగిస్తున్నాడు: అచ్చెన్నాయుడు

రాష్ట్రానికి లభించిన ముఖ్యమంత్రి ప్రజలను మోసంచేసే మరో కార్యక్రమానికి నేడు శ్రీకారంచుట్టాడని, ఇళ్లస్థలాలిస్తున్నామంటూ ఊకదంపుడుప్రచారం చేసుకుంటున్నాడని, పాలకులు తమను మోసగిస్తున్నప్పుడే ప్రజలుమరింత అప్రమత్తంగా ఉండాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు సూచించారు.

శుక్రవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వా రా విలేకరులతో మాట్లాడారు.  ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్తంగా ..! 
 
నేడు ఇళ్లుకడుతున్నామ,  ఇళ్లస్థలాలిస్తున్నాము అని చెప్పుకుం టూ రాష్ట్రవాసులను మోసగిస్తున్న వారిమాటలు నమ్మి ప్రజలు మోసపోకూడదని చెబుతున్నాం. రాష్ట్రం ఏర్పడ్డాక పేదలకు శాశ్వత గృహనిర్మాణపథకాన్ని అమలు చేసినఘనత తెలుగుదేశం పార్టీకి, స్వర్గీయ ఎన్టీ.రామారావు గారికే దక్కుతుంది. టీడీపీ ఏర్పడకముందు రాష్ట్రంలో పూరిగుడిసెలు కళ్లముందు కనిపించేవి.

ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాకే  గ్రామాలు, పట్ణణాలకు సమీపంలో స్థలాలు సేకరించి, పేదలకు గృహాలను నిర్మించారు. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిఅయ్యాక అంతకు రెట్టింపు గృహనిర్మాణాలు చేశారు. జగన్మోహన్ రెడ్డికి ప్రచారయావ ఎక్కువైంది. ఇళ్లపండగ పేరుతో నిత్యం ప్రకటనలిస్తున్న ప్రభుత్వం, ప్రజలకు తప్పుడు మాటలు చెబుతోందన్నారు.

ఫేక్ ముఖ్యమంత్రి తానుఅడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. 28.03లక్షల మందికి ఇళ్లపట్టాలు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటనల్లో పత్రికలిచ్చాడు.  నాసొంత నియోజకవర్గంలో ఇన్నివేల మందికి ఇళ్లపట్టాలిస్తున్నట్లు అధికారులు నాకుఒక బుక్ లెట్ ఇచ్చారు. అదిచూశాక అధికారులుఇచ్చేఇళ్లస్థలాలు ఎక్కడివైనా సరే, అవేవీ నివాసయోగ్యానికి అనుకూలంగా లేవు.

కొండలు, గుట్టలు, శ్మశానాలకు సమీపంలో, వాగులపక్కన, వర్షంపడితే చెరువులను తలపించే ప్రదేశాలను ఇళ్లస్థలాలకు ఎంపికచేశారు. అటువంటి స్థలాలు పేదలకుఎలా ఉపయోగపడతాయో ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. ప్రకటనల్లో జగనన్న ఊళ్లను తయారుచేస్తున్నాడని ఊదరగొట్టారు. జగన్ ప్యాలెస్ లు చూస్తే, ఆయన రాజప్రాసాదాల్లోని బాత్ రూమ్ విస్తీర్ణంకూడా లేని సెంటు స్థలాన్ని పేదలకుఇస్తూ, ఊళ్లనే తయారుచేస్తున్నామంటూ మోస పు మాటలు చెబుతారా?  

జగన్ ప్రభుత్వంలో రూపొందించే ప్రతిపథకంలో అవినీతే. ముందే డబ్బు ఎలా రాబట్టాలనేఆలోచన చేశాకే, పథకాలను జగన్ ప్రభుత్వం   రూపొందిస్తోంది. పేదలు, మరీముఖ్యంగా దళితుల సాగుబడిలో ఉన్నభూములను లాక్కొని, వాటిని ఇళ్లస్థలాలుగా మార్చారు. అన్నినియోజకవర్గాల్లో రూ.5,రూ.10లక్షల విలువ చేయని భూములను రూ.60, రూ.70లక్షలకు ఇళ్లస్థలాల కోసం కొనుగోలు చేశారు. భూములకొనుగోళ్లలోనే వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు అందినకాడికి ప్రభుత్వసొమ్ముని దోచేశారు.

రాష్ట్రం మొత్తమ్మీద వైసీపీప్రభుత్వం ఇళ్లపట్టాల ముసుగులో ఎలా దోచేసిందో, నియోజకవర్గాల వారీగా ఎంతదోపిడీచేశారో ఆధారాలతో సహా, టీడీపీ కేంద్రకార్యాలయంలో ఫొటో ఎగ్జిబిషన్ఏర్పాటు చేశాం. దానిపై వైసీపీనుంచి స్పందనలేదు. ఏనాయకుడుఎంతెంత తిన్నాడు. ఎంతధరకుభూమిని కొని, ఎంతధరకు ప్రభుత్వానికి అంటగట్టాడనే వివరాలన్నీ చెబుతూ, 20రోజులనుంచీ టీడీపీ ఇళ్ల స్థలాల పంపిణీ ముసుగులో జరిగిన అవినీతిని ఆధారాలతోసహా బయపెట్టినా, ప్రభుత్వం నుంచీ ఒక్కరూ మాట్లాడలేదు.

పేదలనుంచి తక్కువధరకు భూమిని కొని, ఎక్కువధరకు ప్రభుత్వానికి అంటగట్టడంద్వారా రూ.4వేలకోట్ల వరకు దోపిడీచేయడం ఒకఎత్తయితే, ఆ విధంగా సేకరించినభూమిని చదునుచేసే పేరుతో, ఉపాధిహామీ పథకం ముసుగులో రూ.2వేలకోట్ల వరకు కాజేశారన్నారు. అంతటితో ఆగకుండా ఆ పనికిమాలిన భూమిని పేదలకుఇవ్వడానికి ప్రతిపట్టాకు  రూ.50వేలు, రూ.60వేలవరకు అందినచోట, అందినట్లు ఇళ్లస్థలాలు కావాలనుకునేవారినుంచి అధికారపార్టీ వారు రూ.500కోట్ల వరకు దిగమింగారు.  

అంతిమంగా వైసీపీప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇళ్లపట్టాల పండుగ పేరుతో రూ.6,500కోట్ల వరకు కాజేసిందనేది జగనెరిగిన సత్యమని ప్రజలందరికీ అర్థమైంది.  28లక్షలమందికి పట్టాలిస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వం, నా నియోజకవర్గంలోని ఒకగ్రామంలో 37మందికి పట్టాలిస్తున్నట్లు కరపత్రాల్లో ప్రచురించింది. 

ఆ గ్రామంలో కేవలం ఏడుగురికి పట్టాలిచ్చిన ప్రభుత్వం, మిగిలిన 30మందికి వారికి ఉన్న సొంత స్థలాలకే పొజిషన్ సర్టిఫికెట్లుఇచ్చి, ప్రభుత్వమే స్థలాలిచ్చినట్లుగా చెప్పుకుంటోంది. అలా చెప్పమని సదరు స్థలాలవారిని బెదిరిస్తు న్నారు. లబ్ధిదారులకుఉన్న సొంతస్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినంతమాత్రాన, ఆస్థలం ప్రభుత్వం ఇచ్చినట్లు అవుతుందా? ఇదేమీ ఇళ్లపట్టాల పంపిణీనో  ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. 

28లక్షల ఇళ్లపట్టాలనిచెబుతున్న లెక్కల్లో, 70శాతంవరకు  సొంతస్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చినవే  ఉన్నాయి. సాక్షి పత్రికకు ప్రకటనలరూపంలో ఖర్చుచేసిన సొమ్ములో కొంతైనా పేదలకు ఖర్చుచేసిఉంటే, సెంటుకి తోడు అదనంగా మరికొంత భూమి ఇవ్వడం సాధ్యమయ్యేది. ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలం, ముఖ్యమంత్రికి , మంత్రులకు, వైసీపీఎమ్మెల్యేలకు ఎంతవరకు ఉపయోగపడుతుందో, పేదలకుకూడా అంతే ఉపయోగపడుతుంది.

ఆ సెంటులో నిర్మించినఇంటిలో మంత్రులుగానీ, ముఖ్యమంత్రి గానీ నివాసం ఉండగలరా? కాస్తపొడవుగా ఉన్న నాలాంటివాళ్లు కాళ్లుచాపుకోవడానికి కూడా ముఖ్యమంత్రి ఇస్తున్నసెంటుస్థలం సరిపోదు.  ఆ విధంగా అరకొర జాగాకు ఇళ్ల పట్టాలిస్తున్నట్లు చెప్పుకుంటూ, జగన్ నిలువునా ప్రజలను మోసగిస్తున్నాడు. 

గతప్రభుత్వం పట్టణాల్లో ధనవంతుల నివాసాలకు దీటుగా పేదలకు గేటెడ్ కమ్యూనిటీ రూపంలో అర్బన్ ప్రాంతాల్లో 5లక్షలఇళ్లను నిర్మించింది. వాటిలో కొన్ని 100శాతం, మరికొన్ని 90శాతం వరకు పూర్తయ్యాయి. ఆ విధంగా  నివాసానికిసిద్ధంగా ఉన్న ఇళ్లను రెండేళ్లనుంచి గాలికొదిలేసిన జగన్మోహన్ రెడ్డి, నేడు సదరునివాసా ల పక్కనే, పేదలకుస్థలాలు ఇస్తున్నట్లు చెబుతున్నాడు.

గృహప్రవే శానికి సిద్ధంగా ఉన్నఇళ్లను పేదలకుఇవ్వకుండా, స్థలాలు ఇస్తే పేదలకు ఉపయోగం ఉంటుందా? టిడ్కోఇళ్లను ఉచితంగా ఇస్తానని చెప్పి, ఊరూరూ తిరిగి ఓట్లేయించుకున్న జగన్మోహన్ రెడ్డి, నేడు నిర్మాణం పూర్తయిన ఇళ్లను ఎందుకు పేదలకుఇవ్వడం లేదో చెప్పాలి. టీడీపీ చేపట్టిన నాఇల్లు నాసొంతం కార్యక్రమానికి లొంగే, నేడుముఖ్యమంత్రి  టీడీపీప్రభుత్వం నిర్మించిన ఇళ్లను పేదలకు ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. 

రంగులు మార్చి, జగన్  తనబొమ్మలు వేసుకున్నా, ఆ ఇళ్లు చంద్రబాబునాయుడే నిర్మించా డని ప్రజలకు తెలుసు.  టిడ్కో ఆధ్వర్యంలోనిర్మించిన ఇళ్లను, పేదలకు హామీ ఇచ్చినట్లుగా వాటిని ఉచితంగానే జగన్ వారికి అందించాలని డిమాండ్ చేస్తున్నాను.

పేదలస్వాధీనంలో ఉన్నసొంత భూమికి పొజిషన్ సర్టిఫికెట్లు ఇచ్చుకుంటూ, తాను ఇళ్లపట్టాలిస్తున్ననంటూ చెప్పుకోవడం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది. ఊరికి దూరంగా ఎక్కడో చెరువులు, వాగులపక్కన ఆయన ఇస్తున్న సెంటుస్థలానికి మెరకవేయడానికే పేదవాడికి సరిపోతుంది. ఇక ఇల్లెప్పుడు కట్టుకుంటాడు.. దానిలో ఎప్పుడు నివాసముంటాడు? ఆ చిన్నఇంటిలో నలుగురు సభ్యులు ఎలా ఉంటారో జగన్ చెప్పాలి. 

మహానగరాల్లో ఎకరాలకు ఎకరాల్లో  నాలుగైదు, ప్యాలెస్ లు నిర్మించుకున్న జగన్మోహ న్ రెడ్డి, పేదలు మాత్రం సెంటు స్థలంలో ఉండాలని చెప్పడం సిగ్గుచేటు. గతంలో ఆయన తండ్రి కూడా రాజీవ్ గృహకల్ప పేరుతో నివాసానికి పనికిరాని ఇళ్లను పేదలకు అందించాడు. అవన్నీ ఇప్పటికీ నిరుపయోగంగానేఉన్నాయి. 

జగన్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్లపట్టాల పంపిణీలో రూ.6,500కోట్ల వరకు అవినీతిజరిగింది. దానిపై ముఖ్యమంత్రికి దమ్ముంటే, ఆయన తక్షణమే ఇళ్లపట్టాల పంపిణీ వ్యవహరంపై సీబీఐ విచారణ జరిపించాలి. అలాచేస్తే జగన్ వసూలు చేసిన జే-ట్యాక్స్ గురించి, వైసీపీఎమ్మెల్యేలు, మంత్రులు గ్రామస్థాయినుంచి సాగించిన దోపిడీ గురించి ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి.

జగన్ తీసుకొస్తున్న పథకాలన్నీ ఆయన దోపిడీకోసమే తప్ప, పేదలకు మేలుచేయ డానికి కాదని ప్రజలు గ్రహించాలి. ఫేక్ ముఖ్యమంత్రి ఇస్తున్న ఇళ్లపట్టాలు కూడా ఫేక్ పట్టాలే. టీడీపీప్రభుత్వంలో గ్రామాల్లోని పేదలకు రెండున్నర సెంట్లు, పట్టణాల్లోని వారికి రెండుసెంట్లు స్థలాలిచ్చాం. స్థలాలకు అవకాశం లేనిచోట గేటెడ్ కమ్యూనిటీ తరహాలో ఇళ్లను నిర్మించి ఇచ్చాము.

జగన్మోహన్ రెడ్డికి నిజంగా పేదల సొంతింటికల తీర్చాలన్న సదుద్దేశమే ఉంటే, చంద్రబాబు నాయుడి మాదిరే పేదలకు సకలవసతులతో ఇళ్లను నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను. చేస్తే ఆ విధంగా చేయండి తప్ప, ప్రజలను మోసగించే పనులు చేయకండి.  ఇళ్లపట్టాల ముసుగులో జగన్ ప్రభుత్వం సాగించిన దోపిడీనీ ఆధారాలతో సహా ప్రజల ముందుంచుతాం.

ప్రజలే వాస్తవాలుగ్రహించి, ప్రభుత్వాన్ని ఛీకొట్టేలా చేస్తాము. ముఖ్యమంత్రి ఇప్పటికైనా  ఇళ్లపట్టాల పంపిణీ ముసుగులో జరిగిన అవినీతిని గ్రహించి,  సీబీఐ విచారణకు ఆదేశించి, అవినీతిపరులను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాను.