ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2024 (13:01 IST)

పవన్‌కు నాలుగు పెళ్లిళ్లే కాదు.. నియోజకవర్గాలు కూడా నాలుగయ్యాయి..

ys jagan
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ ప్యాకేజీ స్టార్ ఇప్పటికే నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇప్పుడు అతను పాలకొల్లు, గాజువాక, భీమవరం, పిఠాపురం అనే నాలుగు వేర్వేరు నియోజకవర్గాల కోసం ప్రయత్నిస్తున్నాడు. ఆయన చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పనిచేసే ప్యాకేజీ స్టార్ అంటూ సీఎం జగన్ ఎద్దేవా చేశారు. 
 
చంద్రబాబు సిట్‌ అంటే సిట్‌.. స్టాండ్‌ అంటే స్టాండ్‌, జగన్‌ను తిట్టు అంటే తిట్టు.. కొట్టు అంటే కొట్టు.. అన్నట్లు ప్యాకేజి స్టార్‌ పరిస్థితి ఉందని జగన్‌ విమర్శించారు. దత్తపుత్రుడా నీకు ఇచ్చేది 80 కాదు 20 సీట్లే అంటే దానికి కూడా జీ హుజూర్‌ అని ప్యాకేజి స్టార్‌ అన్నాడని ఎద్దేవా చేశారు.
 
ఇంతకుముందు ప్యాకేజిస్టార్‌కు పాలకొల్లు, భీమవరం, గాజువాక మూడు అయ్యాయి. ఇప్పుడు పిఠాపురం నాలుగోది అని.. ఏ ప్రాంతమైనా ప్రేమ ఉండదని అన్నారు. ఈ మ్యారేజి స్టార్‌కు ఏ భార్య అయినా ప్రేమ ఉండదని పేర్కొన్నారు. పెళ్లిళ్లే కాదు.. ఇప్పుడు నియోజకవర్గాలు కూడా నాలుగు అయ్యాయని అన్నారు.