సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 9 జూన్ 2023 (16:35 IST)

జూన్ 12 నుండి విద్యార్థులకు జగనన్న విద్యాకానుక

ys jagan
ఏపీలో జూన్ 12 నుండి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. స్కూల్స్ రీ ఓపెన్ అయిన రోజునే 43 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యాకానుకను అందించనున్నట్లు విద్యాశాఖమంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు. 
 
ప్రభుత్వ విద్యా సంస్థల్లో చదువుతూ పది, ఇంటర్‌ పరీక్షల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విద్యార్థులను "జగనన్న ఆణిముత్యాలు" పేరిట సత్కరించే వేడుక రాష్ట్ర స్థాయిలో 20న సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి బొత్ససత్యనారాయణ తెలిపారు.
 
జగనన్న విద్యాకానుక పేరుతో విద్యార్థులకు యూనిఫాం, బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్ట్ బ్యాగ్, ఇంగ్లీష్, తెలుగు పాఠ్యపుస్తకాలు, వర్క్‌ బుక్స్, డిక్షనరీ, నోటు పుస్తకాలు అందిస్తున్నామన్నారు. 
 
ఈ ఏడాది జగనన్న విద్యాకానుకకు రూ.1100 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ ఏడాది విద్యార్థుల యూనిఫాం కుట్టుకూలిని రూ.10 పెంచి రూ. 45 ఇస్తున్నామన్నారు.