శనివారం, 25 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (15:37 IST)

పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన .. సైనిక కుటుంబాల కోసం రూ.కోటి విరాళం

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రెండు ముఖ్యమైన కార్యక్రమాలలో పాల్గొనడానికి గురువారం దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లనున్నారు. ఉదయం కేంద్రీయ సైనిక్ బోర్డు కార్యాలయాన్ని సందర్శిస్తారు. అమర సైనిక వీరుల కుటుంబాల సంక్షేమానికి ప్రకటించిన కోటి రూపాయల చెక్కును ఈ సందర్భంగా సైనికాధికారులకు అందచేస్తారు. 
 
ఇటీవల మిలిటరీ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ అమర సైనిక వీరుల కుటుంబాలకు కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు విజ్ఞాన భవన్‌లో జరగనున్న ఇండియన్ స్టూడెంట్స్ పార్లమెంట్ సదస్సులో పాల్గొంటారు. దేశానికి స్వచ్ఛమైన యువ రాజకీయ నాయకత్వాన్ని అందించడానికి ఉద్దేశించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఆయన పాల్గొంటున్నారు.
 
విద్యార్థుల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. పవన్ కళ్యాణ్ గురించి రూపొందించిన షార్ట్ ఫిలింను ఈ సందర్భంగా ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమానికి మేఘాలయ రాష్ట్ర శాసనసభ స్పీకర్ మెత్బా లింగ్డో అధ్యక్షత వహిస్తారు. కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి జ్యోతిరాదిత్య  సింధియా కూడా ఈ సదస్సులో ప్రసంగిస్తారు.