అనంతలో ఉండి చీపురుపట్టుకుంటా.. అప్పుడే అమ్మాయికి లవలెటర్ రాశా: జేసీ
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు తోచిన విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేసే జేసీ.. తాజాగా అనంత పర్యటనలో ఉన్నారు. అనంతపురం నగర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనకు తోచిన విషయాన్ని ముక్కుసూటిగా చెప్పేసే జేసీ.. తాజాగా అనంత పర్యటనలో ఉన్నారు. అనంతపురం నగర అభివృద్ధి వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన పర్యావరణ పారిశుద్ధ్య శంఖారావం సదస్సులో ఎంపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనంతలో ఉండి రేపటి నుంచి చీపురుపట్టుకుని తానే ఊడుస్తానన్నారు.
జిల్లా అభివృద్ధికి స్థానిక రాజకీయాలు అడ్డుపడుతున్నాయని.. ఎవరు అడ్డుపడినా తాను జిల్లా అభివృద్ధికి పాటుపడతానని జేసీ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా జేసీ ఆసక్తికర వ్యక్తిగత విషయాలను బయటపెట్టారు. చదువుకునే సమయంలో తాను చాలా అల్లరి చేసేవాడినని తెలిపారు. 9వ తరగతిలో ఒకమ్మాయికి లవ్‌లెటర్ కూడా రాశానన్నారు. ఈ విషయం తెలుసుకుని తండ్రి కొట్టిన దెబ్బలతో మనిషిగా మారానని జేసీ చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకున్నారు.