బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 24 డిశెంబరు 2020 (10:29 IST)

ఏసు బోధనలు ఆచరణీయం : రాష్ట్ర గవర్నర్

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేకించి క్రైస్తవ సోదరులకు ఆంధ్రప్రదేశ్ గవర్నర్ మాననీయ బిశ్వభూషణ్ హరిచందన్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

గవర్నర్ మాటలలో... “క్రిస్మస్ అంటే యేసు ప్రభువును జ్ఞాపకం చేసుకునే సమయం. విశ్వవ్యాప్తంగా ప్రజలందరిలో ప్రేమ,సహనం, కరుణ పూర్వక అనుబంధాలను మేలుకొలుపుతూ యేసు బోధలను ఆదరించే సందర్భం ఇది. ధర్మం, విశ్వాసపూరితమైన గమనానికి యేసుక్రీస్తు జీవనం మనందరికీ ప్రేరణనిస్తుంది.

ఈ సందర్భంగా నా క్రైస్తవ సోదరులతో కలిసి ప్రపంచంలో శాంతి, సామరస్యం కోసం ప్రార్థిస్తున్నాను. కరోనా ముప్పు ఇప్పటికీ పొంచి ఉంది.

సాంఘిక దూరాన్ని పాటించటం, ముఖ ముసుగును ధరించటం, తరచుగా చేతులు కడుక్కోవడం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకుని తమ నివాసాలలో సురక్షితంగా ఉంటూ పండుగను జరుపుకోవాలని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.

మీ అందరికీ హ్యాపీ, మెర్రీ క్రిస్మస్ శుభాకాంక్షలు” అని క్రిస్మస్ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గౌరవ బిశ్వ భూషణ్ హరిచందన్ సందేశం ఇచ్చారు. ఈ మేరకు రాజ్ భవన్ నుండి ఒక ప్రకటన వెలువడింది.