సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 12 జనవరి 2020 (16:35 IST)

ఆ పదవి వరిస్తే నేనూ - కేసీఆర్ సమానమే కదా : జితేందర్ రెడ్డి

తాను కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అంతటి స్థాయికి ఎదుగుతానని బీజేపీ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు. కాలం కలిసివచ్చి, అవకాశం వస్తే తాను కూడా బీజేపీ తెలంగాణ శాఖ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపడుతానని జోస్యం చెప్పారు. 
 
మహబూబ్​నగర్​లో నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న ఆయన.. కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తూ ఈ మాటలు మాట్లాడారు. అవకాశముంటే భాజపాకు తాను రాష్ట్ర అధ్యక్షుడిని అవుతానేమో.. కేసీఆర్​తో సమానమైన పదవిలో ఉంటానేమో అని చెప్పుకొచ్చారు. 
 
తనకు ఎంపీగా పోటీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ నాకు అవకాశమివ్వలేదనీ, అయినప్పటికీ తాను అధైర్యపడలేదని చెప్పారు. దేవుడి దయ ఉంటే ప్రస్తుతం తానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని కావొచ్చు.. అది పెద్ద పోస్టే కదా అంటూ తనకు తాను ఓదార్చుకున్నారు. 
 
భాజపా నుంచి కౌన్సిలర్‌గా పోటీచేసే అవకాశం రాని కార్యకర్తలు నిరాశపడొద్దని.. అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తనకు టికెట్‌ ఇవ్వని కేసీఆర్‌ ఇపుడు తెరాసకు రాష్ట్ర అధ్యక్షుడు అని.. అవకాశం భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా తానుంటానని.. అప్పుడు ఇద్దరి పదవులు సమానమే కదా అని జితేందర్ రెడ్డి చెప్పుకొచ్చారు.