గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 11 జనవరి 2022 (20:18 IST)

అందరితో కలిసి చర్చించాకే పొత్తులపై నిర్ణయం : పవన్ కళ్యాణ్

ఏపీ రాజకీయాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అధికార, ప్రతిపక్ష పార్టీల జయాపజయాలను నిర్ణయించే శక్తిగా అవతరించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ అని చాలా మంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసిపోటీ చేసివుంటే ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వచ్చి చంద్రబాబు ముఖ్యమంత్రిగా మరోమారు బాధ్యతలు స్వీకరించివుండేవారని చాలా మంది అభిప్రాయపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం కార్యనిర్వాహక సభ్యులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పొత్తులపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం పొత్తుల కంటే పార్టీ బలోపేతంపైనే దృష్టికేంద్రీకరించాలని ఆయన కోరారు. 
 
అలాగే, పొత్తులపై అందరిదీ ఒకే మాటగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. తాను ఒక్కడినే సింగిల్‌గా పొత్తులపై నిర్ణయం తీసుకునేది ఉండదన్నారు. పొత్తులనేవి ప్రజస్వామ్యంగా, ఆమోదయోగ్యంగా ఉంటే అపుడు ఆలోచన చేద్దామన్నారు. పొత్తులపై ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేంత వరకు ఎవరు కూడా ఎలాంటి వ్యాఖ్యలు చేయొద్దని ఆయన పార్టీ నేతలకు సూచించారు.