బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , సోమవారం, 10 జనవరి 2022 (16:36 IST)

డబుల్ మాస్క్ ధరించాలి... సంక్రాంతి వేడుక ఇంట్లోనే...

రాష్ట్రంలో కరోనా తీవ్రతరమవుతోంద‌ని, అప్రమత్తంగా ఉండ‌టం అవశ్యం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హెచ్చ‌రించారు. రాష్ట్రంలో కరోనా వ్యాప్తిపై పవన్ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా తీవ్రతరమవుతోందని, అప్రమత్తత అవశ్యమన్నారు. అందుబాటులో ఉంటే డబుల్ మాస్క్ ధరించాలని సూచించారు. 
 
 
విందులు, సమావేశాలను కొన్నాళ్లపాటు వాయిదా వేసుకోవడం ఉత్తమమని ప‌వ‌న్ క‌ల్యాణ్ సూచించారు.  రాబోయే సంక్రాంతిని కూడా కుటుంబ సభ్యులతో మాత్రమే జరుపుకోవాలని కోరారు. ఇప్పటి వరకు టీకా తీసుకోనివారు తప్పనిసరిగా టీకా వేయించుకోవాలని తెలిపారు. కరోనా సెకండ్ వేవ్ ప్రభావంతో ఎంతో నష్టపోయామన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వాలు తక్షణమే అప్రమత్తం కావాలని పవన్‌ కళ్యాణ్ పేర్కొన్నారు.