మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జె
Last Modified: శనివారం, 11 మే 2019 (15:27 IST)

టీవీ9 రవిప్రకాష్ కేసులో కె.ఎ. పాల్ కూడా అరెస్టట.. ఎందుకంటే..?

ప్రజాశాంతి పార్టీతో ప్రజల్లోకి దగ్గరవ్వాలని చూసిన ఆ పార్టీ వ్యవస్థాపకులు కె.ఎల్.పాల్ ఎన్నికల తరువాత కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉండిపోయారు. టివి9 రవిప్రకాష్ అంశం తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా కె.ఎ.పాల్ ప్రత్యక్షమయ్యారు. తన సెల్ ఫోన్లో సెల్పీ వీడియో ఒకటి తీసుకుని పోస్ట్ చేశారు. అయ్యా.. రవిప్రకాష్ గారు... టివి9 ఛానల్ ప్రారంభించినప్పటి నుంచి అంటే... 2007 సంవత్సరం నుంచి నేను మీకు బాగా తెలుసు.. మీరు నాకు బాగా తెలుసు. 
 
మీరు ఛానల్ పెట్టేటప్పుడు నేను ఆశీర్వదించాను. దీంతో ఛానల్ బాగా రన్నయ్యింది. టాప్ ప్లేస్‌కు వెళ్ళింది. నన్ను, నా  పార్టీ గురించి మీరు బాగా చూపించారు. మీకు ధన్యవాదములు. అయితే మీరు ఫోర్జరీ సంతకాలు చేసి ఇబ్బందుల్లో ఉన్నారని తెలుసుకున్నాను. నాకు బాధనిపించింది. నేను మీకు అండగా ఉంటాను. మీరు భయపడకండి. ఆ దేవుడు మీకు అన్ని విధాలుగా సహకరిస్తాడు అంటూ వీడియోను పోస్ట్ చేశారు.
 
ఇప్పటికే రవిప్రకాష్ ఫోర్జరీ సంతకాల వ్యవహారంలో నటుడు శివాజీని కూడా విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో కె.ఎ.పాల్ కూడా రవిప్రకాష్‌కు అండగా నిలబడటంతో పోలీసులకు అనుమానం కలుగుతోంది. రవిప్రకాష్‌కు పరోక్షంగా కె.ఎ. పాల్ సహకరించారా అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. విచారణలో భాగంగా కె.ఎ. పాల్‌ను అరెస్టు చేసే అవకాశాలున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.