మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By
Last Modified: శుక్రవారం, 10 మే 2019 (21:14 IST)

నేనే టీవీ9 సీఈఓ అని చెప్పి 24 గంటలు కూడా గడవక ముందే పీకేశారు...

రవి ప్రకాష్ టీవీ9 సీఈఓ కాస్తా మాజీ అయిపోయారు. ఆయన నేనే టీవీ9 సీఈఓను, లైవ్‌లో మీతో మాట్లాడుతున్నా అని మాట్లాడి 24 గంటల కూడా కాక ముందే ఆయనను ఆ పదవి నుంచి తొలగించేశారు. వివరాల్లోకి వెళితే... టీవీ 9 ఛానల్‌ను టేకోవర్ చేసిన అలంద మీడియా రవి ప్రకాష్‌కు ఉద్వాసన పలికింది. అలంద ప్రతినిధులు శుక్రవారం మీడియా సమావేశం నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా వారు చెపుతూ... టీవీ9 సీఈవో, హోల్ టైమ్ డైరెక్టర్ పదవుల నుంచి రవి ప్రకాష్‌ను తొలగించినట్లు వెల్లడించారు. ఆయన స్థానంలో మహేంద్ర మిశ్రాను నియమించినట్లు తెలిపారు. అలాగే టీవీ9 సీఎఫ్‌వో పదవి నుంచి మూర్తిని కూడా తొలగించినట్లు వెల్లడించారు. మే 8న జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో తాము ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. టీవీ9 ఛానల్ పూర్తిగా తమ ఆధీనంలో వున్నదనీ, 9 నెలల క్రితమే ఏబీసీఎల్‌లో 90.5శాతం షేర్లను అలంద మీడియా టేకోవర్ చేసినట్లు తెలిపారు. కాగా రవిప్రకాష్ పైన వచ్చిన ఆరోపణలపై మాట్లాడేందుకు వారు నిరాకరించారు.