నా డబ్బు ఇచ్చి.. క్షమాపణ చెప్పాలి: రవి ప్రకాశ్
తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేసి అందరి మన్ననలు పొందిన విజయలక్ష్మి ప్రస్తుతం అనారోగ్యంతో బాధపడుతున్నారు. అనారోగ్యం కారణంగా కొన్నిరోజులుగా ఆసుపత్రిలో ఉంటున్నారు. అయితే విజయలక్ష్మికి లైంగిక వేధింపులు వస్తున్నట్లు తెలిపారు. కర్ణాటక నటుడు రవి ప్రకాశ్.. ఆమెకు లక్ష రూపాయిలు డబ్బు ఇచ్చినట్లు తెలిపారు. దాంతో పాటు ప్రతిరోజూ ఫోన్‌కాల్స్, మెసేజస్ కూడా చేస్తున్నారని చెప్పొకొచ్చారు.
ఈ విషయాన్ని విన్న రవి ప్రకాశ్.. విజయలక్ష్మి చేసిన ఆరోపణలను తిప్పికొట్టారు. ఆమెపై ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ.. కష్టాల్లో ఉన్న ఆమెకు తను నగదు సాయం చేశానని తెలిపారు. అంతేకానీ, ఎలాంటి లైంగిక వేధింపులకు పాల్పడలేదని అన్నారు.
ఆసుపత్రిలో చికిత్స కోసం కష్ట సమయంలో ఉన్న విజయలక్ష్మి సహాయం చేయాలని కోరితేనే డబ్బులను ఇచ్చానని చెప్పారు. కానీ, విజయలక్ష్మి మాత్రం తనను అవమానం చేస్తూ అసభ్యకర పదజాలంతో దూషిస్తోందని చెప్పారు. తనపై లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో తన డబ్బులు తనకు ఇచ్చేయాలని, అలానే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు రవి ప్రకాశ్. మరి వీరిద్దరిలో ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్దం చెప్తున్నారో తెలియడం లేదు. ఇక.. ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.