శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 13 మార్చి 2017 (10:34 IST)

భూమా నాగిరెడ్డి మృతికి చంద్రబాబే బాధ్యత వహించాలి: కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యలు

టీడీపీ నేత భూమా నాగిరెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో.. భూమా మృతికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి. కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు.

టీడీపీ నేత భూమా నాగిరెడ్డి హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన నేపథ్యంలో.. భూమా మృతికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జి. కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. భూమా నాగిరెడ్డిపై ఎస్సీ, ఎస్టీ, ఎర్రచందనం కేసులు బనాయించిన చంద్రబాబుకు భూమా భౌతిక కాయాన్ని సందర్శించే అర్హత లేదని మండిపడ్డారు.
 
చంద్రబాబు భూమాపై అక్రమ కేసులు బనాయించారని.. ఆర్థికంగా దెబ్బ తీసేందుకు చంద్రబాబు ప్రయత్నించారని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. చంద్రబాబు భూమా నాగిరెడ్డి కుటుంబాన్ని మానసికవేదనకు గురి చేసి... టీడీపీలో చేర్చుకుని అవమానపరిచారని దుయ్యబట్టారు. మంత్రి పదవి ఇచ్చే విషయంలో చంద్రబాబు నాగిరెడ్డిపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చారని ఇదే భూమా నాగిరెడ్డి ప్రాణాల మీదకు తెచ్చిందని కరుణాకర్ రెడ్డి విమర్శించారు. 
 
ఇదిలావుంటే.. భూమా నాగిరెడ్డి మృతి ఏపీ రాజకీయాలకు తీరని లోటు అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి అన్నారు. ఆయన ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని చెప్పారు. మరోవైపు భూమా నాగిరెడ్డి కూతురు, ఎమ్మెల్యే అఖిల ప్రియతో వైసిపి అధినేత వైయస్ జగన్, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ ఫోన్లో మాట్లాడారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.