శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (10:56 IST)

పవన్‌ కళ్యాణ్‌ను వదలొద్దు... రంగంలోకి కావూరి సాంబశివరావు

‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేం... హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నిటినీ కలిపి ప్రత్యేక ప్యాకేజీగా ఇచ్చాం... ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని మెప్పించే ప్రయత్నం చేయండి.. ప్రతిపక్షాల దుష్పచార

‘ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇవ్వలేం... హోదా వల్ల కలిగే ప్రయోజనాలన్నిటినీ కలిపి ప్రత్యేక ప్యాకేజీగా ఇచ్చాం... ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారిని మెప్పించే ప్రయత్నం చేయండి.. ప్రతిపక్షాల దుష్పచారాన్ని అడ్డుకోండి.. జనసేనతో పాటు ఇతర ప్రతిపక్షాలకు దీటైన సమాధానం ఇవ్వండి’ అని బీజేపీ కేంద్ర నాయకత్వం పార్టీ రాష్ట్ర నేతలకు దిశానిర్దేశం చేసింది. 
 
దీంతో ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావును కూడా రంగంలోకి దించనుంది. విభజన బిల్లు సమయంలో కాంగ్రెస్‌ నేతలు ఆడిన నాటకాలను బయటపెట్టాలని ఆయన్ను అమిత్ షా ఆదేశించినట్లు తెలిసింది. ఈ కారణంగానే ఆదివారం ఢిల్లీలో కావూరి కాంగ్రెస్‌ నేతలపై నిప్పులు చెరిగారు. ప్రత్యేక హోదాను బిల్లులో పెట్టడానికి సమయం లేదని, రాష్ట్రపతి అంగీకరించరని, ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైందని సాకులు చెబుతూ కాంగ్రెస్‌ నేతలు తప్పించుకున్నారని, కేవలం రాహుల్‌గాంధీని ప్రధాని చేయాలన్న ఒకే ఒక అత్యాశతోనే ఏపీని విభజించారంటూ అప్పట్లో జరిగిన వివరాలను ఆయన బయటపెట్టారు.
 
అదే సమయంలో ప్రత్యేక హోదా వల్ల కలిగే లాభాలేంటి?... దాని కంటే ప్రత్యేక ప్యాకేజీ ఎంత మెరుగ్గా ఉంది? అన్న వివరాలను లెక్కలతో సహా వివరించాలని బీజేపీ అధిష్ఠానం రాష్ట్ర నేతలను ఆదేశించింది. మిత్రపక్షమైన టీడీపీ నేతలు కలిసి వస్తే కలుపుకొని ప్రకటనలు ఇవ్వడం, ప్యాకేజీపై ప్రచారం చేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సూచించింది.