బడుగు బలహీనవర్గాల అభినవ పూలే కేసీఆర్ : తలసాని

talasani srinivas yadav
ఎం| Last Updated: బుధవారం, 29 జనవరి 2020 (08:40 IST)
బడుగు బలహీనవర్గాల అభినవ పూలే సీఎం కేసీఆర్ అని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. హైదరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ… రిజర్వేషన్లపై ఎన్నికలప్పుడే కొందరు గగ్గోలు పెడతారని మండిపడ్డారు.

బడుగు బలహీనవర్గాలకు టీఆర్‌ఎస్‌ అధిక ప్రాధాన్యమిచ్చిందని కొనియాడారు. కాంగ్రెస్‌ నేతలు సిగ్గులేకుండా డ్రామాలు చేస్తున్నారని, ఎక్స్‌ అఫీషియో సభ్యులపై ఉత్తమ్‌ కుమార్ రెడ్డి అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

ఏపీ ఎంపీని తీసుకొచ్చి నేరేడుచర్లలో గెలవానుకున్నారని, ఉత్తమ్‌కు సిగ్గులేకున్నా… కేవీపీకి లేదా? అని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ప్రశ్నించారు. పీసీసీ అధ్యక్షుడు ఒక్క సీటు కూడా గెలిపించుకోలేక పోయారని ఎద్దేవా చేశారు.
దీనిపై మరింత చదవండి :