శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఎం
Last Updated : బుధవారం, 22 జనవరి 2020 (08:50 IST)

కేసీఆర్‌ కు అస్వస్థత

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అస్వస్థతకు గురయ్యారు.  సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో పరీక్షల అనంతరం సీఎం తిరిగి ప్రగతిభవన్‌కు వెళ్లిపోయారు. కేసీఆర్ ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని టీఆర్‌ఎస్‌ వర్గాలు అంటున్నాయి.

జ్వరం, దగ్గు, జలుబుతో ఇబ్బంది పడుతుండటంతో మంగళవారం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి వెళ్లారు. అంతకుముందే వైద్యులు సీఎం నివాసానికి వచ్చి పరీక్షించారు. ఇబ్బందేమీ లేదని చెప్పారు. అయితే సాధారణ వైద్య పరీక్షలు చేస్తామని, ఆస్పత్రికి రావాలని సూచించారు.

దీంతో ఆస్పత్రికి వెళ్లిన కేసీఆర్‌కు సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ ఎం.వి.రావు నేతృత్వంలో రక్తపరీక్ష, ఈసీజీ, సీటీ స్కాన్‌, 2డి ఇకో తదితర వైద్యపరీక్షలు చేశారు.
 
రాత్రి 8.45 గంటల నుంచి 10:30 గంటల వరకు ఈ పరీక్షలు జరిపారు. సీఎం వెంట ఆయన సతీమణి శోభ, కుమార్తె కవిత, ఎంపీ సంతో్‌షకుమార్‌, మనవడు హిమాన్షు ఉన్నారు. చివరలో మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ కూడా ఆస్పత్రికి వెళ్లారు.