ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2017 (10:20 IST)

మంచి వాడిని దొంగ అన్నారు.. అందుకే తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడపను : కేశినేని నాని

మంచివాడిని దొంగ అన్నారని, ఇది సమాజానికి మంచిది కాదని, తప్పు చేయడం తన డీఎన్ఏలో లేదని టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత నాని అన్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడపబోనని ఆయన తేల్చిచె

మంచివాడిని దొంగ అన్నారని, ఇది సమాజానికి మంచిది కాదని, తప్పు చేయడం తన డీఎన్ఏలో లేదని టీడీపీ ఎంపీ, కేశినేని ట్రావెల్స్ అధినేత నాని అన్నారు. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో బస్సులు నడపబోనని ఆయన తేల్చిచెప్పారు. ఈ రెండు రాష్ట్రాలు కాకుంటే మరో 27 రాష్ట్రాలు ఈ దేశంలో ఉన్నాయన్నారు. 
 
ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘కొన్ని కారణాల వల్ల బస్సుల వ్యాపారం ఆపేయాలని అనుకున్నాను.. ఆపేశాను. నేను పుట్టింది.. పెరిగింది బస్సుల్లో. కావాలంటే, ఆ బస్సులను రోజూ శుభ్రంగా కడిగించుకుంటా.. వాటిని చూస్తూ ఎంజాయ్ చేస్తా తప్పా, ఈ రెండు రాష్ట్రాల్లో నా బస్సే తిప్పను. నా బస్సు.. సేఫెస్టు బస్సు ట్రావెల్ ఇన్ ది కంట్రీ. దేశవ్యాప్తంగా యాక్సిడెంట్ల లెక్కలు చూస్తే.. మా బస్సులకు యాక్సిడెంట్స్ పెద్దగా జరగలేదనే చెప్పవచ్చు. నేను తప్పు చేసినట్టయితే ఈ పాటికి నా వద్ద లక్ష బస్సులు ఉండేవన్నారు.
 
 రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కొవ్వొత్తిలా కరుగుతూ వచ్చానే తప్పా.. పెరగలేదు. రెండేళ్ల నుంచి నా ట్రావెల్స్‌కు నష్టాలు వస్తున్న మాట వాస్తవమే. మార్కెట్లో కొన్ని అనుమతిలేని బస్సులు తిరుగుతుండటం వల్లే ఈ నష్టాలు వస్తున్నాయి. ఇటువంటి నష్టాలను తట్టుకుని ఇంకా పదేళ్లు నిలబడగల కెపాసిటి కేశినేని నానికి, ట్రావెల్స్‌కూ ఉంది... ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో నేను బస్సుల వ్యాపారం చేయను’ అని నాని తెగేసి చెప్పారు.