శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 22 జులై 2019 (15:29 IST)

ఇకపై రేషన్ డీలర్లు ఉండరు.. స్టాకిస్టులుగా ఉపాధి కల్పిస్తాం : మంత్రి కొడాలి

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో ఇకపై రేషన్ డీలర్లు ఉండరని రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి కొడాలి నాని తెలిపారు. అయితే, రేషన్ డీలర్లను స్టాకిస్టులుగా మార్చుతామని తెలిపారు. సోమవారం అమరావతిలోని శాసనసభలో రేషన్ డీలర్ల తొలగింపు అంశంపై చర్చ జరిగింది. దీనికి మంత్రి కొడాలి నాని సమాధానమిచ్చారు. 
 
ప్రస్తుతం రాష్ట్రంలో 30 వేల మంది రేషన్ డీలర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం రేషన్ డీలర్లను తొలగించాలని ప్రతిపాదన లేదన్నారు. టీడీపీ నేతలు మీడియా సమావేశం పెట్టి రేషన్ డీలర్లను తొలిగిస్తున్నారంటూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేషన్ డీలర్లను స్టాకిస్టులుగా మార్చుతామన్నారు. 
 
గతంలో నా నియోజకవర్గంలోనే 42 మంది డీలర్లను తొలగించి టీడీపీ అనుచరులను పెట్టారు. టీడీపీ నేతలు డీలర్లను నుంచి డబ్బులు వసూలు చేశారు. ఒరిజినల్ రేషన్ డీలర్లు ఎవర్ని తొలగించమని, దొంగదారుల్లో వచ్చిన వారు లేచిపోతారని చెప్పారు. గతం ప్రభుత్వం హయంలో రేషన్ డీలర్లపై కేసులు పెట్టారనీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉపాధి కల్పిస్తారు తప్ప తొలగించరని మంత్రి కొడాలి నాని చెప్పుకొచ్చారు.