సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 జనవరి 2025 (11:47 IST)

రాజకీయాల నుంచి తప్పుకోవడమా..? అవన్నీ అవాస్తవాలు.. కొడాలి నాని

kodali nani
వైకాపా నేత కొడాలి నాని రాజకీయాల నుండి వైదొలగాలని యోచిస్తున్నట్లు ఇటీవల వ్యాపించిన పుకార్లు కలకలం సృష్టించాయి. వైకాపా నేత విజయసాయి రెడ్డి, అయోధ్య రామి రెడ్డి రాజకీయాల నుండి వైదొలగాలని సంచలన ప్రకటనల తరువాత, కొడాలి నాని కూడా ఆరోగ్య కారణాల వల్ల రాజకీయాలకు వీడ్కోలు పలకడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి.
 
అయితే, వార్తలను కొడాలి నాని తీవ్రంగా ఖండించారు. సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న పోస్టుల్లో ఎలాంటి నిజం లేదని కొడాలి నాని స్పష్టం చేశారు. తన రాజీనామా వార్తలు కల్పితమైనవని, వాటిన నమ్మవద్దని ప్రజలను కోరారు.
 
 తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా దీనిపై కొడాలి నాని మాట్లాడుతూ.. తాను పదవి నుంచి తప్పుకోవడం లేదని ప్రకటించారు. ఇలాంటి అవాస్తవమైన వార్తలను ప్రచురించవద్దని కొడాలి నాని మీడియా సంస్థలను కోరారు.