మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జనవరి 2020 (12:37 IST)

తెలంగాణ సీఎం పీఠంపై కేటీఆర్ స్పందన.. ఏం చెప్పారంటే?

కొత్త దశకంలో సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం అగ్రగామిగా ఎదుగుతుందన్నారు రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. సీఎం పదవిపై స్పందించారు. ఈ మేరకు చిట్ చాట్‌లో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈ ఏడాది తాను సీఎం అవుతానన్న చర్చే అవసరం లేదని స్పష్టం చేశారు. 
 
అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ స్పష్టత ఇచ్చిన తర్వాత అనుమానం ఎందుకని ప్రశ్నించారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టం అభివృద్ధిలో దూసుకుపోతుందన్నారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా నిలుస్తోందన్నారు. 2019 సంవత్సరం బ్రహ్మాండమైన ఆరంభాన్ని ఇచ్చిందని.. 2020 మున్సిపల్ ఎన్నికల్లో ఘనవిజయంతో శుభారంభం చేస్తామన్నారు కేటీఆర్. కొత్త మున్సిపల్‌ చట్టం సమర్థంగా అమలు చేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. 
 
టీపీసీసీ పదవికి ఉత్తమ్ రాజీనామా ఆయన వ్యక్తిగత వ్యవహారమని.. టీఆర్ఎస్ ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీయే అన్నారు. ఏపీతో తెలంగాణకు మంచి సంబంధాలు లేవని ఎవరు చెప్పారని కేటీఆర్ ప్రశ్నించారు. ఏపీతో చిన్న చిన్న సమస్యలున్నా.. వాటిని పరిష్కరించుకుంటామని చెప్పుకొచ్చారు.