బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 28 అక్టోబరు 2019 (12:44 IST)

శ్వేతా రెడ్డి షాకింగ్ కామెంట్స్.. సమంత, మంచు లక్ష్మి బాగానే లబ్ధి పొందారుగా..

టీవీ యాంకర్ శ్వేతా రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలకు కేర్ ఆఫ్ అడ్రెస్‌గా మారింది. తాజాగా సమంత, మంచు లక్ష్మిలపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇటీవల షీ టీమ్స్ ఏర్పడి ఐదు సంవత్సరాలు గడిచిన సందర్భంగా సమంత అక్కినేని, మంచు లక్ష్మి, పీవీ  సింధులకు శుభాకాంక్షలు చెబుతూ, సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టిన సంగతి తెలిసిందే. వీటినే ప్రస్తావించిన శ్వేతారెడ్డి, వీరు ముగ్గురూ తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రయోజనాలు పొందినవారేనని షాకింగ్ కామెంట్స్ చేసింది. 
 
సమంత రాష్ట్రానికి చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారని, కేటీఆర్ నుంచి ఆమెకు అవకాశాలు వచ్చాయని ఆరోపించింది. మంచు లక్ష్మి ఫ్యాషన్ షోలు, సినిమాలు తదితరాలకు ప్రభుత్వం నుంచి కొద్దో గొప్పో ప్రయోజనాలను పొందారని, పీవీ సింధు ప్రభుత్వం నుంచి ఎకరాలకు ఎకరాల భూమిని తీసుకుందని ఆరోపించింది. 
 
ఈ ముగ్గురు మహిళామణులు ఇక బంగారు తెలంగాణలో సేఫ్ అండ్ సెక్యూర్డ్‌గా ఫీల్ కాకుండా ఏడ్చే పరిస్థితి ఎక్కడుందని ప్రశ్నించింది. వీరు ముగ్గురూ తప్ప రాజకీయ నాయకులుగానీ, జర్నలిస్టులు గానీ, పోలీసుల్లోని మహిళలుగానీ షీ టీమ్స్ గురించి స్పందించలేదని శ్వేతా రెడ్డి వెల్లడించింది.