1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 2 ఫిబ్రవరి 2021 (10:40 IST)

ఆర్యవైశ్యులకు ‘కుటుంబ సురక్ష’ ఆసరా: దేవా‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీ‌నివాస‌రావు

ఆర్యవైశ్య కుటుంబాలకు వాసవీ కుటుంబ సురక్ష పథకం ఎంతో ఆసరాగా ఉందని దేవ‌దాయ శాఖ మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు తెలిపారు.

విజ‌య‌వాడ‌‌ బ్ర‌హ్మ‌ణ‌వీధిలోని  మంత్రి కార్యాల‌యంలో జ‌రిగిన ‘కుటుంబ సురక్ష’   కార్యక్రమంలో మంత్రి వెలంప‌ల్లి శ్రీనివాస‌రావు ‌పాల్గొన్ని 17 మందికి  రూ.25 లక్షలు చెక్కులు పంపిణీ చేశారు.

కార్య‌క్ర‌మంలో ఛాంబ‌ర్ అప్ కామ‌ర్స్ అధ్య‌క్షలు కొన‌క‌ళ్ల విధ్యాధ‌రరావు, ఫాస్ట్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వంకదారు వాసుదేవ‌రావ్‌, ఐఈసీ ఆఫీసర్‌ చీదెళ్ళ బసవేశ్వరరావు, వి212ఎ జిల్లా గవర్నర్ బొడ్డు శ్రీనివాసరావు, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ కె.ఎల్‌.వి.స‌తీష్‌కుమార్‌, ఇన్‌ఛార్జ్ పొట్టి శివకుమార్, జిల్లా వాసవీ ప్ర‌తినిధులు పాల్గొన్నారు.