లోకేష్‌కి కా అంటే కీ రాదు... లక్ష్మీ పార్వతి సెటైర్లు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై స్వర్గీయ ఎన్.టి.రామారావు సతీమణి, ఎన్టీఆర్ టీడీపీ అధ్యక్షురాలు లక్ష్మీ పార్వతీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అంతేగాకుండా నారా లోకేష్‌పై కూడా నిప్పులు చెరిగారు. నందమూరి కుటుంబాన్ని కరివేపాకులా చంద్రబాబు వాడుకున్నారని ఆరోపించారు. ఈ విషయం తెలుసుకునే హీరోలు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్‌లు దూరంగా వున్నారన్నారు.
అలాగే లోకేష్‌కి కా అంటే కీ రాదని విమర్శించారు. నెలకు రూ.10 లక్షల ఖర్చుతో ట్యూషన్ పెట్టించి తెలుగు భాష నేర్పినా కూడా లోకేష్ నేర్చుకోలేకపోతున్నాడన్నారు. అతనిని సీఎం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఏపీలో ఎన్నికలెప్పుడు వస్తాయా అని ప్రజలు ఎదురుచూస్తున్నారని లక్ష్మీపార్వతి అన్నారు.
ఏపీలో ఎన్నికలొస్తాయని చెప్పే అమరావతిలోని నీరు కొండపై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. నీరుకొండలో ఎన్టీఆర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తామంటూ బాబు మాయమాటలు చెప్తున్నారని... ఆ మాటలను ప్రజలు ఏమాత్రం నమ్మొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.