శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Modified: గురువారం, 8 సెప్టెంబరు 2016 (13:13 IST)

చంద్రబాబు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి - వామపక్షాలు

ఎపికి ప్రత్యేక హోదాపై తిరుపతిలో వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంకు తాళాలు వేసి ఉద్యోగస్తులను లోపలికి వెళ్ళనీయకుండా నిరసనకు దిగారు. ప్రత్యేక హోదాకి కాకుండా ప్రత్యేక ఆర్థిక సహాయానికి చంద్రబాబు చేతులు చాచడంపై వామపక్షాలు మండిపడ్డాయ

ఎపికి ప్రత్యేక హోదాపై తిరుపతిలో వామపక్ష నేతలు ఆందోళనకు దిగారు. బిఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయంకు తాళాలు వేసి ఉద్యోగస్తులను లోపలికి వెళ్ళనీయకుండా నిరసనకు దిగారు. ప్రత్యేక హోదాకి కాకుండా ప్రత్యేక ఆర్థిక సహాయానికి చంద్రబాబు చేతులు చాచడంపై వామపక్షాలు మండిపడ్డాయి. బాబుకు ఏ మాత్రం చిత్తశుద్థి ఉన్నా వెంటనే తన పదవికి రాజీనామా చేసి ప్రత్యక్ష ఆందోళనకు దిగి రావాలని డిమాండ్‌ చేశాయి.
 
ఈ నేపథ్యంలో ఆందోళన చేస్తున్న వామపక్ష నేతలను పోలీసులు అరెస్టు చేశారు. విచక్షణా రహితంగా మహిళలని కూడా చూడకుండా ఈడ్చి పారేశారు. ప్రత్యేక హోదా ప్రకటన కేంద్రప్రభుత్వం చేయకుంటే ఆందోళన ఉదృతం చేస్తామని వామపక్ష నేతలు హెచ్చరించారు.