శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 12 సెప్టెంబరు 2016 (14:09 IST)

లాలీపప్ ఓ బాలుడి ప్రాణం తీసింది.. గొంతులో ఇరుక్కుపోయి..?

లాలీపప్ అంటేనే చిన్నపిల్లలకు ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. అయితే ఆ లాలీపప్ ఓ బాలుడి ప్రాణాలు తీసిందంటే నమ్ముతారా.. నిజమే.. లాలీపప్ తింటూ తింటూ గొంతులో ఇరుక్కుపోవడం ద్వారా ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కర్

లాలీపప్ అంటేనే చిన్నపిల్లలకు ఎంతిష్టమో అందరికీ తెలిసిందే. అయితే ఆ లాలీపప్ ఓ బాలుడి ప్రాణాలు తీసిందంటే నమ్ముతారా.. నిజమే.. లాలీపప్ తింటూ తింటూ గొంతులో ఇరుక్కుపోవడం ద్వారా ఓ చిన్నారి మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కర్నూలు జిల్లా కొండాపురం గ్రామానికి చెందిన చంద్రయ్య శెట్టి కుమారుడు వేణు(8)కు లాలీపప్‌ అంటే ఇంతో ఇష్టం.
 
రోజూ లాలీపప్ కొనివ్వందే ఊరుకునేవాడు కాదు.. వేణుకి అదే అలవాటైపోయింది. ఇలా ఆదివారం ఆ బాలుడు లాలీపప్‌ తింటుండగా గొంతులో ఇరుక్కు పోయింది. అది గమనించిన తల్లిదండ్రులు లాలీపప్‌ను బయటకు తీసేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. 
 
కానీ ఒక్కసారిగా బాలుడి ముక్కులోంచి రక్తం రావడంతో వెంటనే కర్నూలు ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గం మధ్యంలోనే ఆ బాలుడు మృతి చెందాడు. బిడ్డ మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. ఇంకా కొండాపురం గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.