గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 17 జులై 2017 (11:49 IST)

పెళ్లికాని యువకుడితో ముగ్గురు పిల్లల తల్లి వివాహేతర సంబంధం.. ఆపై...

పెళ్లికాని యువకుడితో ముగ్గురు బిడ్డల తల్లి పెట్టుకున్న వివాహేతర సంబంధం చివరకు వారి బలవన్మరణాలకు కారణమైంది. కడప జిల్లా రాజంపేటలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే...

పెళ్లికాని యువకుడితో ముగ్గురు బిడ్డల తల్లి పెట్టుకున్న వివాహేతర సంబంధం చివరకు వారి బలవన్మరణాలకు కారణమైంది. కడప జిల్లా రాజంపేటలో జరిగిన ఈ విషాదకర సంఘటన వివరాలను పరిశీలిస్తే... 
 
కడప జిల్లా ఖాజీపేట మండలం సుంకేశుల గ్రామానికి చెందిన రాజోలు నాగార్జున రెడ్డి (26) అనే యువకుడికి ఇంకా పెళ్లికాలేదు. ఈయన ఇటీవలే సౌదీకి వెళ్లి తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ఇంటివద్దే తాపీపని చేస్తూ జీవిస్తున్నాడు. ఈ క్రమంలో అదే మండలం కొమ్ములూరు గ్రామానికి చెందిన అమర్‌నాధ్‌ రెడ్డి భార్య లక్ష్మీపార్వతి (33) అనే వివాహితతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమగా మారి.. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది. 
 
ఈ క్రమంలో శనివారం లక్ష్మీపార్వతి, నాగార్జున రెడ్డి తిరుపతికి వచ్చి, దైవదర్శనం చేసుకుని తిరిగి ఊరికి వెళుతూ.. రాజంపేట రైల్వేస్టేషన్‌ సమీపంలో ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడంతో తలలు ఛిద్రమైపోయాయి. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, లక్ష్మీపార్వతి ముగ్గురు పిల్లల తల్లి కావడంతో ఇపుడు ఆ పిల్లలంతా తల్లిలేని బిడ్డలయ్యారు.