శుక్రవారం, 21 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 20 మార్చి 2025 (15:04 IST)

ఎస్వీ యూనివర్శిటీ విద్యార్థికి రూ.2.5 కోట్ల ప్యాకేజీ

Money
తిరుపతిలోని ఎస్సీ విశ్వవిద్యాలయానికి చెందిన ఓ విద్యార్థికి వార్షిక వేతనం రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం లభించింది. అలాగే, ఈ వర్శిటీకి చెందిన విద్యార్థులు రికార్డు స్థాయిలో వేతనాలతో ప్లేస్‌మెంట్స్ సాధించారు. వీరిలో విష్ణు అనే విద్యార్థి రికార్డు స్థాయిలో రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు. అలాగే, నాగవంశీరెడ్డి రూ.కోటికిపైగా వేతనంతో ప్లేస్‌మెంట్ సాధించి రికార్డు సృష్టించాడు. 
 
బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్ విభాగంలో ఫైనల్ ఇయర్ విద్యార్థి శ్రీ విష్ణు ప్రముఖ రోబోటిక్ అండ్ ఆటోమేషన్ కంపెనీలో ఏకంగా రూ.2.5 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం పొంది రికార్డకెక్కాడు. అలాగే, బేతిరెడ్డి నాగ వంశీరెడ్డి అనే విద్యార్థి రూ.1.03 కోట్ల వార్షిక ప్యాకేజీతో ఉద్యోగం పొందాడు. 
 
ఈ యేడాది ఎస్వీయూ విద్యార్థుల్లో 1700 మందికి పైగా పది లక్షల నుంచి రూ.2.5 కోట్ ప్యాకేజీలను అందుకున్నారు. 1912 మంది విద్యార్థులు ఒకటి కన్నా ఎక్కువ ఉద్యోగ ఆఫర్లను పొందారు. ప్రముఖ కంపెనీలైన పాలో అల్టో నెట్ వర్క్, న్యూటానిక్స్, మైక్రోసాఫ్ట్, సిస్కో, పేపాల్, అమెజాన్ వంటి ప్రతిష్టాత్మక బహుళజాతి కంపెనీల నుంచి విద్యార్థులు ప్లేస్‌మెంట్లు పొందారు. 
 
ప్రవీణ్, కుంచల అనే విద్యార్థి కోటి రూపాయలు, ఎస్.అర్జున్ రూ.63 లక్షలు, అంజలి రూ.53 లక్షలు, నూకవరపు వంశీ రూ.51 లక్షలు, నజియా ఫర్వీన్ రూ.51 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగాలు సాధించారు.