గురువారం, 20 మార్చి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 20 మార్చి 2025 (14:06 IST)

Vijay Devarakonda: మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం.. నా కాలేజీ రోజులు వస్తున్నాయ్

Vijay Devarakonda
Vijay Devarakonda
ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరిగే మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వార్షిక ఏకత్వ దినోత్సవ వేడుక 2025 ఈ ఏడాది విజయ్ దేవరకొండ ముఖ్యఅతిథిగా హాజరయ్యారని మరింత ప్రత్యేకంగా జరిగింది. సురారంలోని మల్లారెడ్డి క్రికెట్ గ్రౌండ్‌లో ఈ వేడుక మల్లారెడ్డి యూనివర్సిటీ విద్యార్థుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. 
 
ఈ వేడుకకు సిహెచ్ మల్లారెడ్డి, మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవస్థాపకులు, ఛైర్మన్, డా. భద్రారెడ్డి, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ ఛైర్మన్, డా. సిహెచ్ ప్రీతి రెడ్డి, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ ఛైర్మన్, స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నితిన్, స్టార్ హీరో తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
 
ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. మల్లారెడ్డి ఎప్పటికప్పుడు చెబుతుంటారు పాలు, పూలు అమ్మి ఈ స్థాయికి వచ్చానని, దేశం గర్వించదగిన మూడు విశ్వవిద్యాలయాలు ఉన్నాయని, కానీ అందులో అంతకన్నా ఆయనకు విద్యార్థుల ప్రేమ ఎంతో విశేషమైనదని అన్నారు. 
Vijay Deverakonda
Vijay Deverakonda
 
మనకు నచ్చిన పనిని చేస్తే మనం నిజంగా సంతోషంగా ఉంటాము. అందుకే సినిమాల షూటింగ్ సమయంలో సంతోషంగా ఉంటాను, సినిమా బ్లాక్ బస్టర్ అయితే ఇంకా ఆనందంగా ఉంటాను.. అని విజయ్ దేవరకొండ అన్నారు.
 
అలాగే, "ఎప్పుడూ స్టూడెంట్స్‌తో ఉంటే చాలా ఉత్సాహంగా ఉంటాను. నా కాలేజీ రోజులు గుర్తుకువస్తున్నాయి. 10 సంవత్సరాల క్రితం 'ఎవడే సుబ్రహ్మణ్యం' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చాలా కాలేజీలను తిరిగి, విద్యార్థులతో మాట్లాడిన అనుభవం గుర్తు అవుతుంది" అని విజయ్ గుర్తుచేసుకున్నారు. 
Vijay Deverakonda
Vijay Deverakonda
 
"జీవితంలో మీరు ఇష్టపడిన వాటిని చేస్తే సంతోషంగా ఉంటారు. జీవితంలో 3 విషయాలు మనం గుర్తించాలి, ఆరోగ్యంగా ఉండటం, డబ్బు సంపాదించడం, మనం చేసే పనిని ఇష్టపడటం. ఇవి జరిగితే మనం సంతోషంగా ఉంటాం," అని విజయ్ దేవరకొండ సూచించారు. 
 
"ఈ వయసులో మన తల్లిదండ్రుల మాట వినడం ముఖ్యం. వారు మనకు మంచి కోసమే చెబుతున్నారు. మన తల్లిదండ్రులని సంతోషంగా చూసుకోవడం మన మొదటి బాధ్యత. వారు సంతోషంగా ఉన్నప్పుడు మనం నిజమైన విజయాన్ని సాధించినట్లే" అని విజయ్ చెప్పుకొచ్చారు. 
Vijay Deverakonda
Vijay Deverakonda
 
ఈ వేడుకలో మరో ప్రత్యేక ఆకర్షణగా డా. సిహెచ్ ప్రీతి రెడ్డి గారి అద్భుత నృత్యం హాజరైన వారందరినీ మంత్రముగ్దులను చేసింది. ఆమె నృత్యం ఈ వేడుకకు మరింత సాంస్కృతిక వైభవాన్ని తెచ్చింది. మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ విద్యార్థులకు ఈ వేడుక ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. యూనివర్సిటీ అందరినీ గర్వంతో ముందుకు నడిపించే ఒక ఇన్స్టిట్యూషన్‌గా అభివృద్ధి చెందుతుంది.
 
 
ముఖ్య అతిథులు:
సిహెచ్ మల్లారెడ్డి, మల్లారెడ్డి యూనివర్సిటీ వ్యవస్థాపకులు, ఛైర్మన్ 
డా. భద్రారెడ్డి, మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ ఛైర్మన్
కే.పీ. వివేకానంద్ గౌడ్, కూత్బుల్లాపూర్ ఎమ్మెల్యే 
డా. సిహెచ్ ప్రీతి రెడ్డి  
మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్ వైస్ ఛైర్మన్
విజయ్ దేవరకొండ
నితిన్, స్టార్ హీరో