గురువారం, 20 మార్చి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 20 మార్చి 2025 (11:30 IST)

Rain: వేసవి కాలంలో వర్షాలు పడే అవకాశాలు.. మార్చి 22, 23 తేదీల్లో భారీ వర్షాలు

rain
వేసవి కాలంలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ హెచ్చరిచింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు పడనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల అంటే మార్చి 21, 22 తేదీల్లో పలు జిల్లాల్లో వర్షాలు పడనున్నట్లు సమాచారం. మార్చి 20 నుంచి మేఘాలు ఏర్పడతాయని.. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు. 
 
మరోవైపు పలు ప్రాంతాల్లో వర్షాలు పడే ముందు ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల సహా అనేక జిల్లాలు 40-41 డిగ్రీల సెల్సియస్ మధ్య తీవ్ర ఉష్ణోగ్రతలను ఎదుర్కొంటాయని సమాచారం.
 
అలాగే ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు పడే అవకాశం ఉందని వారు తెలిపారు. మార్చి 22, 23 తేదీల్లో ఉత్తరాంధ్ర, దక్షిణ కోస్తా, రాయలసీమ వంటి ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.