శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:35 IST)

నన్ను గెలిపించండి.. మీకు అందుబాటులో వుంటా.. మాధవీలత

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న సినీ నటి మాధవీలత తనను గెలిపించాలని ఓటర్లను కోరారు. రానున్న ఎన్నికల్లో తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో వుంటానని.. చెప్పుకొచ్చారు. తనను గెలిపిస్తే ప్రజా సేవ చేసుకుంటానని, ఓడిపోతే, బీజేపీ నిర్ణయం ప్రకారం ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాడతానని అన్నారు. 
 
గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఎన్నో సమస్యలున్నాయని, డ్రైనేజీ, మంచినీరు, పెన్షన్లు వంటి సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని వెల్లడించారు. ఎన్నికల ప్రచారం కోసం ఎక్కిడికి వెళ్లినా వాళ్లింటి అమ్మాయిగానే భావిస్తున్నారని.. తన గెలుపు ఖాయమని మాధవీలత ధీమా వ్యక్తం చేశారు.
 
సినీ నటులంతా వైసీపీలో చేరుతున్న నేపథ్యంలో.. జాతీయ పార్టీతో మేలెంతో వుంటుందనే బీజేపీలో చేరానని.. ప్రాంతీయ పార్టీని ఎంచుకుంటే ఓ ప్రాంతానికే పరిమితం అవుతామని మాధవీలత వ్యాఖ్యానించారు. ఏపీలోని ప్రాంతీయ పార్టీల్లో నైతిక విలువలు కనిపించట్లేదని మాధవీలత తెలిపారు. ఇకపోతే.. గుంటూరు బీజేపీ పశ్చిమ అభ్యర్థిగా మాధవీలత అభ్యర్థిత్వాన్ని బీజేపీ ఖరారు చేసిన సంగతి తెలిసిందే.