సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 19 జనవరి 2019 (09:57 IST)

తెలంగాణ శాసనసభ సీఎల్పీ నేతగా భట్టి విక్రమార్క

తెలంగాణ రాష్ట్ర శాసనసభ కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ నేతగా మల్లు భట్టి విక్రమార్క ఎన్నికయ్యారు. ఈ మేరకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. తెలంగాణ శాసనసభ సమావేశాల ప్రారంభం రోజునే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సమావేశమై సీఎల్పీ నేతకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి నివేదికను పంపారు. ఈ నివేదికను పరిశీలించిన రాహుల్‌... మల్లు భట్టి విక్రమార్కను సీఎల్పీ నేతగా నియమించారు. 
 
నియామక లేఖను ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అశోక్ గెహ్లాట్ అధికారికంగా విడుదల చేశారు. మల్లు భట్టి విక్రమార్క ఇటీవల జరిగిన ఎన్నికల్లో మధిర నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున 19 మంది అభ్యర్థులు విజయం సాధించిన విషయం తెల్సిందే.