శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 సెప్టెంబరు 2016 (15:05 IST)

కుమార్తెతో కోరిక తీర్చమన్న ప్రియుడిని చంపించిన ప్రియురాలు...

కుమార్తెతో కోరిక తీర్చమని ఒత్తిడి చేసిన ప్రియుడిని కొంతమంది కిరాయి సభ్యులతో కలిసి ప్రియురాలు హత్య చేయించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం జుగరాజుపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ

కుమార్తెతో కోరిక తీర్చమని ఒత్తిడి చేసిన ప్రియుడిని కొంతమంది కిరాయి సభ్యులతో కలిసి ప్రియురాలు హత్య చేయించింది. ఈ ఘటన అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం జుగరాజుపల్లిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ గ్రామానికి చెందిన ఓబిలేశు అనే వ్యక్తికి అదే గ్రామానికి చెందిన గంగమ్మ అనే యువతితో వివాహేతర సంబంధం ఉండేది. కానీ గంగమ్మ ఓబులేసును కాకుండా కొత్తచెరువుకు చెందిన పోతులయ్యను వివాహం చేసుకుంది. అప్పటికే ఓబిలేశు భార్య హత్య కేసులో 2005 నుంచి జైలుశిక్ష అనుభవిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో శిక్షాకాలం పూర్తి కావడంతో గత ఆగస్టు 15న ఓబిలేశు జైలు నుంచి విడుదలయ్యాడు. 
 
దీంతో గంగమ్మ బెంగళూరుకు వెళ్లి అతడిని కలుసుకుంది. కొంతకాలం అక్కడే ఉంటూ తిరుమల, కసాపురం పుణ్యక్షేత్రాలకు వెళ్లొచ్చారు. ఆసమయంలో గంగమ్మ ఇంటికి వచ్చిన ఓబిలేశు.. గంగమ్మ కుమార్తెపై మోజుపడి తన కోరిక తీర్చాల్సిందిగా అడిగాడు. దీంతో గంగమ్మ అతడి పీడ వదిలించుకోవడానికి మాయమాటలు చెబుతూ దాట వేస్తూ వచ్చింది. 
 
ఈ క్రమంలో ఓబిలేశు తాను ఎంతకైనా తెగించడానికి సిద్ధమని గంగమ్మను బెదిరించాడు. దీంతో భయపడిన గంగమ్మ ఓబిలేశును చంపించడానికి పూనుకుంది. ఈ క్రమంలోనే జగరాజుపల్లికి చెందిన దివాకర్‌రెడ్డితో సంప్రదింపులు జరిపి, రూ.2 లక్షలకు బేరం కుదుర్చుకుంది. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం, గ్రామంలో అయితే నీ కోరిక తీర్చడానికి ఇబ్బందిగా ఉంటుందని, బయటికి వెళ్దామంటూ కొత్తచెరువు మండలం కొత్తపల్లి పొలంలో గల మామిడి తోటలోకి ఓబిలేశును గంగమ్మ తీసుకెళ్లింది.
 
అప్పటికే అక్కడ కాపుకాసివున్న కిరాయి ముఠా సభ్యులు డ్రిప్‌వైరుతో ఓబిలేశు గొంతును బిగించారు. పెద్దపెద్దరాళ్లు తీసుకుని ఓబిలేశు తలపై బాది హత్య చేశారు. అయితే, డబ్బు చెల్లించడంలో సమస్యలు తలెత్తి పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో గంగమ్మను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం వెలుగు చూసింది.