శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 10 సెప్టెంబరు 2018 (10:22 IST)

అమ్మ పిలిచిందని తీసుకెళ్లి 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు..

అమ్మ పిలిచిందని తీసుకెళ్లాడు. 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమరోలు మండలం చినగానిపల్లె గ్రామంలోని ఓ బాలిక (13)పై అదే గ్రామానికి

అమ్మ పిలిచిందని తీసుకెళ్లాడు. 13 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే..  కొమరోలు మండలం చినగానిపల్లె గ్రామంలోని ఓ బాలిక (13)పై అదే గ్రామానికి చెందిన మీనిగ రంగస్వామి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన శనివారం రాత్రి జరిగింది. గ్రామానికి చెందిన గిరిజన బాలిక స్థానికంగా ఉన్న పాఠశాలలో ఆరో తరగతి చదువుతోంది. 
 
అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల పాటు ఇంటి వద్దే వున్న బాలికపై రంగ స్వామి కన్నేశాడు. అంతే శనివారం ఒంటరిగా వున్న బాలిక వద్దకు వెళ్లిన ఆ కామాంధుడు.. అమ్మ పిలుస్తుందని చెప్పి.. గ్రామ శివారుకు తీసుకెళ్లాడు. ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. 
 
ఈ ఘటనపై బాలిక తల్లి శనివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. గిద్దలూరు సీఐ శ్రీ రామ్‌ గ్రామానికి వెళ్లి విచారించారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అత్యాచార చట్టం, నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తును కొనసాగిస్తున్నట్లు గిద్దలూరు సీఐ తెలిపారు.